My Home Group Expressed Generosity: అపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ముందుకు వచ్చే మై హోం గ్రూప్.. మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని సాయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మై హోమ్ గ్రూప్ యాజమాన్యం భారీ విరాళం అందించింది. రూ. 51లక్షల 15వేలు విలువైన పీడియాట్రిక్ వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, చిన్న పిల్లలకు అవసరమైన ఇతర వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కు అందించింది.
మై హోమ్ గ్రూప్‌లో భాగమైన బనగానపల్లె సమీపంలోని మహా సిమెంట్ యూనిట్ హెడ్ గురివిరెడ్డి, హెచ్ ఆర్ హెడ్ శివ ప్రసాద్ ఇతర సిబ్బంది కలెక్టర్ వీర పాండ్యన్‌కు చిన్న పిల్లలకు కావల్సిన వైద్య పరికరాలను అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో అందించామని మై హోమ్ గ్రూప్ యాజమాన్యం తెలిపింది. ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటామని స్పష్టం చేశారు. మై హోమ్ గ్రూప్ యాజమాన్యంను కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అభినందించారు. వీరిలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇతర పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Read Also… Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. జలమయం అయిన పలు ప్రాంతాలు..