Andhra Pradesh Elections: ఏపీలో మరో ఎన్నికల ఫైట్.. కుప్పంలో చంద్రబాబు Vs మంత్రి పెద్దిరెడ్డి వార్..!

|

Nov 04, 2021 | 10:15 PM

AP Politics: కుప్పం నీదా? నాదా?.. చంద్రబాబు Vs మంత్రి పెద్దిరెడ్డి. ఓ వైపు పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని రిపీట్ చేస్తామంటోంది వైసీపీ. మరోవైపు పరువు కోసం పాకులాడుతోంది టీడీపీ.

Andhra Pradesh Elections: ఏపీలో మరో ఎన్నికల ఫైట్.. కుప్పంలో చంద్రబాబు Vs మంత్రి పెద్దిరెడ్డి వార్..!
Babu And Peddireddy
Follow us on

AP Politics: కుప్పం నీదా? నాదా?.. చంద్రబాబు Vs మంత్రి పెద్దిరెడ్డి. ఓ వైపు పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని రిపీట్ చేస్తామంటోంది వైసీపీ. మరోవైపు పరువు కోసం పాకులాడుతోంది టీడీపీ. మరి ఈ మున్సిపల్ వార్‌లో ఎవరిది పైచేయి అవుతుంది? కుప్పంపై ఎగరేది ఎవరి జెండా?.

చంద్రబాబుకి అగ్నిపరీక్ష ఈ మున్సిపల్ ఎన్నిక. ఇజ్జత్‌ కా సవాల్. మున్సిపల్ వార్‌లో డూ ఆర్ డై పరిస్థితి ఆయనది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై చంద్రబాబుని ఒంటరిగా నిలపింది. మళ్లీ ఇప్పుడు మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. మరి మున్సిపల్ ఎన్నికల్లోనైనా సైకిల్ సత్తా చాటుతుందా? లేక మళ్లీ ఫ్యాన్‌ హవానే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఇప్పటికే రెండు పార్టీలు ఛైర్మన్ అభ్యర్థుల్ని ప్రకటించాయి. 16వ వార్డు నుంచి వైసీపీ ఛైర్మన్ క్యాండిడేట్ డాక్టర్‌ సుధీర్‌ నామినేషన్ వేశారు. ఇక తెలుగుదేశం ఛైర్మన్ అభ్యర్థిగా ఇప్పటికే త్రిలోక్‌ను ప్రకటించారు. నామినేషన్లు కూడా జోరందుకున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

కుప్పంలో మున్సిపల్ వార్ ఓ రేంజ్‌లో ఉంటుందని పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఎందుకంటే చంద్రబాబుకి మరో ఓటమి రుచి చూపించాలని అధికార వైసీపీ ఉవ్వీళ్లూరుతోంది. అటు కనీసం ఈ ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన చంద్రబాబుకు.. కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్‌లోకి దింపారు మంత్రి పెద్దిరెడ్డి. అంటే ఇప్పుడు పరిస్థితి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లుగా మారింది. నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయ్యాక కుప్పంలోనే మకాం వేయనున్నారు మంత్రి పెద్దిరెడ్డి. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీ లోనూ క్లీన్ స్వీప్ చేయాలన్నది ఆయన టార్గెట్. 25 వార్డులను కైవసం చేసుకుంటామని పెద్దిరెడ్డి వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దండయాత్ర ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. చాలా చోట్ల టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఈ దెబ్బతో ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిందా అన్నపరిస్థితిలోకి వెళ్లిపోయింది తెలుగుదేశం. ఘోర పరాజయంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆత్మస్థైర్యం దెబ్బతింది. దీంతో ఈ మధ్యే కుప్పంలో పర్యటించారు చంద్రబాబు. రోడ్‌షో ద్వారా బలప్రదర్శన చేశారు. టీడీపీ బలం తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. అటు వైసీపీ కూడా ఇప్పటికే ప్లానింగ్ మొదలు పెట్టింది. పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేసింది. సీనియర్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఫలితంగా కుప్పంలో ఇప్పటికే హైవోల్టేజ్‌ క్రియేట్ అయింది.

Also read:

Chandrababu – TDP: అన్నీ రికార్డ్ చేస్తున్నాం.. ఏపీ సర్కార్, పోలీస్ వ్యవస్థపై చంద్రబాబు సంచలన కామెంట్స్..

America Poison Frog: డ్రాగన్ కంట్రీ నుంచి తైవాన్‌ను కాపాడేందుకు అదిరిపోయే ప్లాన్ వేసిన అమెరికా.. అదేంటంటే..

WHO: కరోనా ముప్పు ఇంకా పొంచివుంది.. ఫిబ్రవరి నాటికి యూరప్‌లో 5 లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్ఓ