సామాజిక సమానత్వ దిశగా ముందడుగు.. చారిత్రాత్మక పట్టణంలో వీధుల పేర్ల మార్పు..!

చారిత్రాత్మక పట్టణంలో వీధుల పేర్లు మారుస్తూ మున్సిపల్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరాలుగా కులాల పేర్లతో కొనసాగుతున్న పలు వీధుల పేర్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బొబ్బిలి పట్టణంలోని మొత్తం పదకొండు వీధులకి కొత్త పేర్లు నిర్ణయించింది.

సామాజిక సమానత్వ దిశగా ముందడుగు.. చారిత్రాత్మక పట్టణంలో వీధుల పేర్ల మార్పు..!
Bobbili, Vizianagaram

Edited By:

Updated on: Jan 31, 2026 | 9:20 PM

చారిత్రాత్మక పట్టణంలో వీధుల పేర్లు మారుస్తూ మున్సిపల్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరాలుగా కులాల పేర్లతో కొనసాగుతున్న పలు వీధుల పేర్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బొబ్బిలి పట్టణంలోని మొత్తం పదకొండు వీధులకి కొత్త పేర్లు నిర్ణయించింది. కుల ఆధారిత పేర్లు ప్రభుత్వం నిషేధించడంతో పాటు మానవహక్కుల పరిరక్షణ దృష్ట్యా వాటిని మార్చడం అత్యవసరమని అధికారులు భావించారు.

ఈ నేపథ్యంలో తొలి వార్డులోని చాకలి వీధికి నందెన్న వీధి అనే పేరు పెట్టగా, రెండో వార్డులో ఉన్న హరిజనవాడను ఇకపై ఆది ఆంధ్ర వీధిగా పిలవాలని నిర్ణయించారు. మూడో వార్డులో పెదచాకలి వీధికి బాపూజీ వీధి అనే కొత్త పేరు వర్తింపజేశారు. 3వ, 4వ వార్డుల పరిధిలోని ఆకులరెల్లి వీధిను ఆర్సీఎం వీధిగా మారుస్తూ తీర్మానం ఆమోదించారు. అలాగే ఆరో, ఏడో వార్డుల్లో ఉన్న చాకలి, వడ్డీ చాకలి వీధులను రెండిటినీ మంగిశెట్టి వీధిగా మార్చారు. పదో వార్డులోని హరిజనవాడకు భీమ్రావ్ వీధి పేరు ఖరారైంది.

12వ వార్డులోని చాకలి వీధి వెంగళరాయ వీధిగా, 24వ వార్డులోని పాత హరిజనవాడ మొకరా వీధిగా మారింది. అదే వార్డులోని మరో చాకలి వీధికి దేశమ్మ తల్లి వీధి అనే పేరు ఇచ్చారు. 30వ వార్డులోని పాకీ వీధి ఇక నుంచి చిక్కాల వీధిగా పిలవనున్నారు. ఈ మార్పులకు సంబంధించిన తీర్మానాలను బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి, మానవహక్కుల కమిషన్‌కి నివేదన పంపినట్లు మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి వెల్లడించారు. ఈ నిర్ణయం బొబ్బిలిలో సామాజిక సమానత్వం, సమగ్రత, గౌరవ భావాల పెంపుదలకు దోహదం చేస్తుందనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..