AP Local Body Elections: కర్నూలు జిల్లాలో హీరో వెంకటేష్‌కు ఓటు.. పేరు మాత్రం ఆయనది కాదు..

AP Local Body Elections: సినీ నటుడు వెంకటేశ్ ఎక్కడుంటారంటే అందరూ టక్కున హైదరాబాద్ అని చెబుతారు. కానీ ఎవరైనా కర్నూలు..

AP Local Body Elections: కర్నూలు జిల్లాలో హీరో వెంకటేష్‌కు ఓటు.. పేరు మాత్రం ఆయనది కాదు..

Updated on: Feb 19, 2021 | 9:51 PM

AP Local Body Elections: సినీ నటుడు వెంకటేశ్ ఎక్కడుంటారంటే అందరూ టక్కున హైదరాబాద్ అని చెబుతారు. కానీ ఎవరైనా కర్నూలు అని చెబుతారా? ఇది చూస్తే చెప్పాల్సి వస్తుందేమో. అవును, హీరో విక్టరీ వెంకటేష్ కర్నూలు జిల్లా వాసి అట. కర్నూలు జిల్లాలోని కల్లూరు వెంకటేశ్ స్వగ్రామం అట. ఇది మేం చెబుతుంది కాదండోయ్.. స్వయంగా ఎన్నికల అధికారులే ఈ విషయాన్ని ధృవీకరించారు. అంతేకాదు.. ఏకంగా ఆయన పేరును కూడా మార్చేశారు. అదెలాగంటారా? తెలుసుకుందాం పదండి. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుదిదశకు చేరింది.

ఇప్పటికే మూడు దశల పోలింగ్ ప్రక్రియ ముగియగా.. చివరి దశ అయిన నాలుగో విడత పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ నాలుగో దశలోనే కర్నూలు జిల్లా కల్లూరు పరిధిలోని గ్రామాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉందే. అయితే, తాజాగా కల్లూరు పరిధిలోని ఓటర్ల జాబితాలో సినీ నటుడు వెంకటేష్ ఫోటో ఉంది. అది చూసిన పలువురు ఖంగుతిన్నారు. ఓటర్ల లిస్ట్‌లో ఆయన ఫోటో ఎలా వచ్చిందంటూ షాక్ అవుతున్నారు. ఓటర్ లిస్ట్‌లో వెంకటేష్ ఫోటో ఉండగా, పేర్లు మాత్రం వేరే వారివి ఉన్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also read:

AP Local Body Elections: ఇవిగో వాస్తవాలు.. ఇప్పుడు చూపించండి.. చంద్రబాబుకు సజ్జల రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్..

అభిమానులకు ఒకేసారి డబుల్ ట్రీట్ ఇవ్వనున్న నాని.. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టని నేచురల్ స్టార్..