కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో కొడుకు, తల్లి మృతి చెందడం స్థానికులను కంటతడిపెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే సోమవారం రోజున ఉదయం పూట సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని గోదాం గడ్డ వద్ద బొల్లంపల్లి శ్యాంసుందర్ (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గత ఏడు నెలల క్రితమే అతని భార్య శారద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోవడంతో మనస్థాపానికి గురైన శ్యాంసుందర్… సోమవారం రోజున తమ పెళ్లిరోజునే భార్య ఆత్మహత్య చేసుకున్న స్థలంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
దీంతో శ్యాంసుందర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చివరికి సోమవారం సాయంత్రం అతనికి అంత్యక్రియలు చేసి, కుటుంబ సభ్యలు, బంధుమిత్రులు, స్థానికులు ఇంటికి తిరిగి వచ్చేశారు. అయితే రాత్రి సమయంలో శ్యాంసుందర్ తల్లి కనకలక్ష్మికి ఛాతిలో నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆ తల్లి మృతి చెందింది. కొడుకు ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లోపే తల్లి చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం