అయ్యో దేవుడా.. మాటలకందని విషాదం.. చావులోనూ వీడని తల్లీబిడ్డ బంధం.. పురుడుపోసిన కాసేపటికే..

విధి ఎంత విచిత్రమైనది.. నవ మాసాలు మోసి బిడ్డను కన్న తల్లి చనిపోయిన 24 గంటల్లోనే.. ఆ చిన్నారి మృతి చెందింది.. ప్రసవ వేదన భరించలేక బిడ్డను కన్న ఆ తల్లి కాసేపటికి మృతి చెందితే.. ఆ తల్లి డెడ్ బాడీని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో.. అప్పుడే పుట్టిన శిశువు కూడా చనిపోయింది.

అయ్యో దేవుడా.. మాటలకందని విషాదం.. చావులోనూ వీడని తల్లీబిడ్డ బంధం.. పురుడుపోసిన కాసేపటికే..
Sri Sathya Sai district Tragedy

Edited By:

Updated on: Dec 29, 2025 | 8:36 PM

విధి ఎంత విచిత్రమైనది.. నవ మాసాలు మోసి బిడ్డను కన్న తల్లి చనిపోయిన 24 గంటల్లోనే.. ఆ చిన్నారి మృతి చెందింది.. ప్రసవ వేదన భరించలేక బిడ్డను కన్న ఆ తల్లి కాసేపటికి మృతి చెందితే.. ఆ తల్లి డెడ్ బాడీని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో.. అప్పుడే పుట్టిన శిశువు కూడా చనిపోయింది. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల ప్రకారం.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం బసనపల్లి ఆటోనగర్ కు చెందిన ఖలీం, నజ్మా దంపతులు.. నజ్మా గర్భిణి.. పురుటినొప్పులు రావడంతో ఆమెను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నవ మాసాలు మోసిన నజ్మా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఆడబిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత నజ్మా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అనంతపురం ప్రభుత్వాసుపత్రులు చికిత్స పొందుతూ తల్లి నజ్మా మృతి చెందింది. బిడ్డ పుట్టిందని సంతోషించాలో.. తల్లి చనిపోయిందని బాధపడాలో తెలియని వేదనలో ఉన్న ఆ కుటుంబానికి… కాసేపటికి మరో విషాదం చూడాల్సి వచ్చింది. చనిపోయిన నజ్మా డెడ్ బాడీని అంబులెన్స్ లో హిందూపురం తరలిస్తుండగా.. అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురి అయింది.. పొగ మంచు కారణంగా ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి అంబులెన్స్ ఢీ కొట్టింది..

ఈ ప్రమాదంలో అప్పుడే పుట్టిన చిన్నారి కూడా మృతి చెందింది.. నజ్మా చనిపోయిందని పుట్టెడు దుఃఖంలో డెడ్ బాడీని తీసుకెళ్తుంటే.. ప్రమాదం రూపంలో మృత్యువు చిన్నారిని కబళించింది.. ఒకే రోజు తల్లి, బిడ్డ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. గంటల వ్యవధిలోనే తల్లి, బిడ్డ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..