అనంతపురం జిల్లాలో పెనువిషాదం.. బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం

|

Feb 23, 2021 | 3:25 PM

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపప్పురు మండలం ముచ్చుకోట వరదాయిపల్లి గ్రామ సమీపంలో బైక్‌కు విద్యుదాఘాతం సంభవించి..

అనంతపురం జిల్లాలో పెనువిషాదం.. బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం
young man commits suicide
Follow us on

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపప్పురు మండలం ముచ్చుకోట వరదాయిపల్లి గ్రామ సమీపంలో బైక్‌కు విద్యుదాఘాతం సంభవించి తల్లీ, కొడుకులు మృతి చెందారు. గ్రామం నుంచి కొండకు వెళ్తుండగా..  తెగిపడి ఉన్న మెయిన్ కరెంట్ తీగలను గమనించకుండా బైక్‌పై అలాగే వెళ్లడంతో కరెంట్ షాక్ కొట్టి వెంకటలక్ష్మమ్మ(55), ఆమె కొడుకు వెంకట స్వామిలు(36) స్పాట్‌లోనే మృతి చెందారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

డెడ్‌బాడీలు తరలించడానికి బంధువులు, గ్రామస్థులు నిరాకరించారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్‌ చేశారు. తల్లీ, కొడుకు మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

Also Read:

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు