
భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులకు రుతు పవనాలు విస్తరించాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఋతుపవనాలు ప్రవేశించాయి. మరో మూడు నాలుగు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటించింది ఐఎండి. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు ప్రవేశించే అవకాశముంది.
ఈ నెలలోనే భారతదేశంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండి. మే 26న డేట్ ఫిక్స్ చేసింది. అయితే వాతావరణ పరిస్థితుల దృశ్య ఆ తేదీకి నాలుగు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు కేరళను తాగే అవకాశం ఉండవచ్చని ఐఎండి వివరించింది. అంటే మే చివరి వారంలో ఎప్పుడైనా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్న మాట.
సాధారణంగా భారత వాతావరణ అంచనా ప్రకారం ప్రతిఏటా జూన్ 1 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి ఉత్తరాదిశగా కదులుతూ విస్తరిస్తాయి. దేశంలోనే మిగతా ప్రాంతాలకు క్రమంగా ఉతుపవనాలు చేరుకుంటాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి రుతుపవనాలు విస్తరించినచోట వర్షాలు కురవడం మొదలవుతుంది. ఈ వర్షాల సీజన్ సెప్టెంబర్ వరకు ఉంటుంది.
రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత.. ఏపీలోని రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రమంతా అలాగే.. తెలంగాణకు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. ఐఎండి అంచనాన్ని బట్టి.. ప్రతిఏటా సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న తాకిన తర్వాత పది రోజులకు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా. కానీ ఈసారి ఈ నెలాఖరు లోగానే కేరళకు తాకితే.. అప్పటి పరిస్థితులను బట్టి ఏపీలోకి ఇప్పుడు ప్రవేశిస్తుందనేది ఒక అంచనాకు వస్తారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతానికి కేరళకు తాకే తేదీని ప్రకటించారు.
ఏటా జూన్ ఒకటో తేదీ కల్లా కేరళను ఋతుపవనాలు తాకాల్సి ఉన్నప్పటికీ.. గతేడాది ఎనిమిది రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వాతావరణంలో అనుకూల పరిస్థితులకు తోడు అరేబియా మహాసముద్రంలో అల్పపీడన వ్యవస్థ కూడా ఎర్లీ మాన్‌సూన్ కు కారణమైంది. 2009 తరువాత వారం రోజులు ఎర్లీగా గతేడాది మాన్సూన్ కేరళలోకి ప్రవేశించింది. ఆ సమయంలో కేరళలో భారీ నుంచి అతిభారి వర్షాలు బలమైన ఎదురుగాలతో కొన్ని రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది.
అండమాన్ తీరంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో.. మరికొద్ది రోజుల్లోనే వర్షాల సీజన్ భారత్ లో మొదలైనట్టే.. ఆ తర్వాత కేరళకు రుతుపవనాలు తాకుతాయి. వాతావరణ పరిస్థితులు బట్టి విస్తరించాక భారత భూభాగంలో.. తొలకరి పలకరిస్తుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాఖ చల్లటి కబురు అందించడంతో అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..