AP Weather: రాబోయే 2 రోజులు ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

|

Nov 20, 2023 | 1:36 PM

వెదర్ బులిటెన్ తాజాగా విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టము నుండి 3.1 కి.మీ ఎత్తు వరకు ఉన్న ఉపరితల అవర్తనము కొనసాగుతుందని వివరించింది. పూర్తి డీటేల్స్....

AP Weather: రాబోయే 2 రోజులు ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
Andhra Weather
Follow us on

తూర్పు గాలులలో సగటు సముద్ర మట్టం వద్ద నుండి ఏర్పడిన ద్రోణి శ్రీలంక నుండి నైరుతి & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టము నుండి 3.1 కి.మీ ఎత్తు వరకు ఉన్న ఉపరితల అవర్తనము కొనసాగుతున్నది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

——————-

సోమవారం, మంగళవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

బుధవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

రాయలసీమ :-

——————-

సోమవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

మంగళవారం, బుధవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..