AP Assembly: ఏపీ స్పీకర్‌ కీలక ప్రకటన.. ఇకపై అసెంబ్లీలోకి సెల్‌ఫోన్లకు నో ఎంట్రీ..

|

Nov 26, 2021 | 2:34 PM

ఏపీ శాసనసభలోకి సభ్యులెవరూ సెల్ ఫోన్లను తీసుకురావొద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా శాసనసభలో సెల్ ఫోన్ల వినియోగం వద్దని సభ్యులకు సూచించారు..

AP Assembly: ఏపీ స్పీకర్‌ కీలక ప్రకటన.. ఇకపై అసెంబ్లీలోకి సెల్‌ఫోన్లకు నో ఎంట్రీ..
Follow us on

ఏపీ శాసనసభలోకి సభ్యులెవరూ సెల్ ఫోన్లను తీసుకురావొద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా శాసనసభలో సెల్ ఫోన్ల వినియోగం వద్దని సభ్యులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 19న అసెంబ్లీలో జరిగిన చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ మైక్ కట్ చేసినా టీడీపీ సభ్యులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. వీటిపై వివాదం కూడాచెలరేగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే స్పీకర్ తమ్మినేని ముఖ్యమైన ప్రకటన అంటూ సభలో సెల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు.

నిబంధనల ప్రకారం పార్లమెంట్, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు.. సభలో ఏమైనా అనుకోని ఘటనలు… అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, గొడవలు వంటివి జరిగినప్పుడు వాటికి సంబంధించిన ఫుటేజ్‌లను బయటికి రాకుండా జాగ్రత్త పడతారు. కొన్నిసార్లు వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు. ఈ క్రమంలో ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు లైవ్ లోకి వెళ్లకుండా స్పీకర్ తమ్మినేని మైక్ కట్ చేశారు. కానీ అక్కడ ఉన్న టీడీపీ నేతలు మాత్రం.. చంద్రబాబు మాటలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకే అసెంబ్లీలో సెల్ ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నేటి(శుక్రవారం)తో ముగియనున్నాయి. అంటే వచ్చే బడ్జెట్ సమావేశాల నుంచి ఈ నిర్ణయం అమలవుతుందన్నమాట.

Also Read:

AP Weather Alert: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

Bore Well Water: అనంతపురం జిల్లాలో వింత.. ఎండిపోయిన బోరు నుంచి ఉబికి వస్తున్న జలాలు

Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్తింటికి ఎట్రాక్షన్‌గా మారిన కడియం నర్సరీ మొక్కలు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..