MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌.. ఏపీలో మొత్తం 5, తెలంగాణలో ఒకటి..

|

Mar 13, 2023 | 8:47 AM

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది.

MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌.. ఏపీలో మొత్తం 5, తెలంగాణలో ఒకటి..
Mlc Polling
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 3 పట్టభద్రులు, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. ఎన్నికల అధికారులు 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 11 అదనపు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 29,720 ఓటర్లలో పురుషులు 15,472 మంది కాగా.. స్త్రీలు 14,246 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ బరిలో 37 మంది అభ్యర్థులు.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ బరిలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం గ్రాడ్యుయేట్ బరిలో 49 మంది అభ్యర్థులు.. కడప, అనంతపురం ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.

పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 10,00,519 పట్టభద్రులైన ఓటర్లు, ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల్లో 55,842 మంది ఓటర్లు, స్థానిక సంస్థల నియోజక వర్గాల ఎన్నికల్లో 3,059 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పట్టభద్రుల స్థానాల ఎన్నికకు 1,172 పోలింగ్ స్టేషన్లను, ఉపాధ్యాయ స్థానాల ఎన్నికకు 351 పోలింగ్ స్టేషన్లను, 3 స్థానిక సంస్థల స్థానాల ఎన్నికలకు 15 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 584 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటి వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం