MLA Prakash Reddy: ‘అవును మేమే దాడి చేశాం..’ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన కామెంట్స్

|

Aug 28, 2022 | 3:13 PM

పోలీసులపై ప్రతిసారి నోరు పారేసుకోవడం హీరోయిజం అనుకుంటున్నారని.. అయితే సునీత,  శ్రీరామ్ కు రక్షణ కల్పిస్తున్నది పోలీసులేనన్నారు. మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

MLA Prakash Reddy: అవును మేమే దాడి చేశాం.. ఎమ్మెల్యే  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన కామెంట్స్
Mla Thopudurthi Prakash Red
Follow us on

MLA Prakash Reddy: అవునే మేమే దాడి చేశాం.. డొంక తిరుగుడు లేదు.. సూటిగా స్పష్టంగా చెప్పేశారు.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. శ్రీసత్యసాయి జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనపై ప్రకాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. పరిటాల కుటుంబ దౌర్జన్యాలపై పోరాటానికి సిద్ధమని, చెన్నేకొత్తపల్లి వైస్ సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేస్తున్న వారిని అడ్డుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఉప సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి పరిటాల వారు చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు పరిటాల  శ్రీరామ్ స్వయంగా చంపాలనుకున్నారన్నారని చెప్పారు. ఈవిషయంపై పోలీసులకు సమాచారం అందిస్తే వారు పరిటాల సునీత నిరసన కార్యక్రమానికి బందోబస్తుకు వెళ్లినట్టు చెప్పారు. ఈ లోపు తమ నాయకున్ని చంపుతారన్న ఆందోళనతో మా సోదరుడు రాజశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్లి కాపాడారన్నారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ముందు వారి ప్రతిఘటించడంతో మా వాళ్లే దాడి చేశారని కూడా దాడిపై క్లారిటీ ఇచ్చారు. పోలీసులపై ప్రతిసారి నోరు పారేసుకోవడం హీరోయిజం అనుకుంటున్నారని.. అయితే సునీత,  శ్రీరామ్ కు రక్షణ కల్పిస్తున్నది పోలీసులేనన్నారు. మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. తోపుదుర్తి రాజకీయాల కోసం పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

 

Reporter: Kanth, Tv9 Telugu

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..