MLA Roja: పుత్తూరు చెరువుకట్ట నిర్మాణ కాంట్రాక్టర్‌పై కేసు పెట్టండి.. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే రోజా

|

May 18, 2021 | 3:43 PM

చిత్తూరు జిల్లా పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పగుళ్లు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్లు, స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైరయ్యారు.

MLA Roja: పుత్తూరు చెరువుకట్ట నిర్మాణ కాంట్రాక్టర్‌పై కేసు పెట్టండి.. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే రోజా
Mla Roja Phone Call To Collector
Follow us on

MLA Roja phone call to Collector: కాంట్రాక్టర్లు, స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైరయ్యారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రోజా జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

పుత్తూరులో చెరువుకట్ట పగుళ్లపై ఎమ్మెల్యే రోజా ఆరా తీశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆమె జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ట్యాంకు నిర్మాణంలో ఉల్లంఘనలకు పాల్పడ్డ కాంట్రాక్టరు, సంబంధిత అధికారులను గుర్తించి వెంటనే చర్యల తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.

ఈ ప్రాజెక్టులో 55 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం అయ్యినట్లు ఆమె ఆరోపించారు. ఈ ప్రాజెక్టును తప్పు స్థలంలో నిర్మించినందున దాన్ని పరిశీలించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. కాంట్రాక్టర్ నుంచి డబ్బును రికవరీ చేసి స్టోరేజ్ ట్యాంక్ వద్ద పనులను బలోపేతం చేయాలన్నారు. పుత్తూరు మున్నిపాలిటీలోని జనవాసాల మధ్య నిర్మించారని, జరగరాని ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆమె హెచ్చరించారు.

Read Also…  Covid Care: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..