Nandamuri Balakrishna: అవసరమైతే రాజీనామాకు సిద్ధం.. నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్..

|

Feb 04, 2022 | 1:40 PM

MLA Nandamuri Balakrishna doing mouna deeksha : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి రాజుకుంది. తమ ప్రాంతం పేరుతో జిల్లాను ప్రకటించాలని

Nandamuri Balakrishna: అవసరమైతే రాజీనామాకు సిద్ధం.. నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్..
Nandamuri Balakrishna
Follow us on

MLA Nandamuri Balakrishna doing mouna deeksha : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి రాజుకుంది. తమ ప్రాంతం పేరుతో జిల్లాను ప్రకటించాలని ఇప్పటికే పలు జిల్లాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌ బాగా వినిపిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే సైతం హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ మరో ఉద్యమానికి నాంది పలికారు. ఈ మేరకు హిందూపురం (Hindupur) లో బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. ముందు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు టీడీపీ శ్రేణులు, జిల్లా మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్‌ కూడలిలో బాలకృష్ణ మౌన దీక్ష (mouna deeksha) కు కూర్చున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తాను రాజీనామా చేస్తానని.. వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ సవాల్‌ విసిరారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇదిలాఉంటే.. మౌన దీక్ష అనంతరం బాలకృష్ణ సాయంత్రం అఖిలపక్ష నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొననున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Also Read:

Dowry to Girls: అక్కడ పెళ్లి కావాలంటే అబ్బాయిలు ఎదురుకట్నం ఇవ్వాల్సిందే.. ఇంకో క్రేజీ రూల్ కూడా ఉంది

Hyderabad: హైదరాబాద్‌లో హైఅలెర్ట్.. రంగంలోకి క్విక్ రియాక్షన్ టీమ్ & రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌