Eluru: ఎమ్మెల్యేనా.. మజాకానా.! పుట్టినరోజుకు ఏకంగా ట్రాక్టర్ అంత కేక్.. బరువు ఎంతో తెలిస్తే

| Edited By: Ravi Kiran

Nov 15, 2024 | 12:26 PM

చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి.. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన మద్దిపాటి వెంకటరాజు అందరిని ఆకట్టుకుంటూ , కలుపుకుంటూ తనదైన రాజకీయం చేస్తున్నారు. ఆయన అభిమానులు కేజీ, రెండు కేజీలు కాదు ఏకంగా..

Eluru: ఎమ్మెల్యేనా.. మజాకానా.! పుట్టినరోజుకు ఏకంగా ట్రాక్టర్ అంత కేక్.. బరువు ఎంతో తెలిస్తే
Trending
Follow us on

ఆస్తులు కాదు.. అభిమానం కూడబెట్టుకోమంటారు పెద్దలు. ప్రజాభిమానం ఉన్న నేతలను వారి అభిమానులు గొప్పగా చూసుకుంటారు. అయితే చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి.. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన మద్దిపాటి వెంకటరాజు అందరిని ఆకట్టుకుంటూ , కలుపుకుంటూ తనదైన రాజకీయం చేస్తున్నారు. అయితే మద్దిపాటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు కేజీ, రెండు కేజీలు కాదు ఏకంగా 200ల కేజీల కేకు చేయించారు. దీన్ని ఒక ట్రాక్టర్‌కు అమర్చి ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో అందరిని ఆకర్షించింది.

ఈ భారీ కేక్ కటింగ్ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలోని ఒక ఫంక్షన్ హాల్‌లో జరిగింది. దూబచర్లలో ఎమ్మెల్యే అభిమానులైన సింహా టీం సభ్యులు ఎమ్మెల్యే పుట్టినరోజు అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నారు. అందుకోసం ముందుగానే భారీ కేకును సిద్ధం చేశారు. నియోజకవర్గంలో మరెవరికి విషయం తెలియకుండా 200 కేజీల కేకును ప్రత్యేకంగా తయారు చేయించారు. దానిని ఒక ట్రాక్టర్‌పై జాగ్రత్తగా ఉంచి దూబచర్ల నుంచి నల్లజర్లలోని ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు జరిగే ఫంక్షన్ హాల్ వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

అక్కడ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో అతి భారీ కేకును కట్ చేయించి ఆయనతో పాటు అక్కడికి వచ్చిన అభిమానులందరికీ తినిపించారు. ఇక అంతటితో ఆగకుండా ఆ మిగిలిన కేకు ముక్కలను ఊరంతా పంచారు. అలా సింహా టీం సభ్యులు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించడం కూటమి కార్యకర్తల్లో జోష్ నింపింది. ఇక మంత్రి లోకేష్‌ను కలిసి మద్దిపాటి తన జన్మ దినోత్సవం సందర్భంగా ఆశీస్సులు తీసుకోగా.. నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలను సైతం కార్యకర్తలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: 

గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

 విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..