AP News: ఏపీ నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపు డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.

AP News: ఏపీ నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
Nara Lokesh
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Nov 15, 2024 | 12:17 PM

రాష్ట్రంలో నిరుద్యోగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై ఆరా తీస్తుంది. అవకాశం ఉన్నచోట ఉద్యోగాల్ని భర్తీ చేయాలని ఆరాటపడుతుంది. అందులో భాగంగానే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. వీలైనంత త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో స్వయంగా ఈరోజు డీఎస్సీకి సంబంధించిన కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపు డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. 1994 నుంచి డీఎస్సీల నిర్వహణపై ఆరా తీస్తున్నామని అనేకసార్లు కోర్టులలో వివాదాలతో ఆలస్యం అయిన నేపథ్యంలో వాటిని పరిష్కరించే ఆలోచన చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకోకుండా వాటన్నిటిని నిరోధించేలా డీఎస్సీ ప్రక్రియని చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు లోకేష్ అసెంబ్లీ లో తెలిపారు.

గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్న లోకేష్

రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయని అయితే గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా డీఎస్సీ నియామకాలు చేపట్టలేదని, ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదంటూ లోకేష్ వైఎస్ఆర్సిపి పై తీవ్ర విమర్శలు చేశారు. హడావుడిగా ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 12, 2024 న డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారని, అది కూడా 6100 పోస్టులకంటూ నోటిఫై చేశారు. కానీ ఆ తర్వాత దానిన ప్రక్రియను కూడా పట్టించుకోలేదని లోకేష్ విమర్శించారు. డీఎస్సీ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్ని వైసిపి దారుణంగా మోసం చేసిందని, అలాంటి మోసాలకు ఇక తావు లేకుండా తెలుగుదేశం పార్టీ నిర్దిష్టమైన ప్రణాళికతో మెగాడీఎస్సీతో ముందుకు రానుందని తెలిపారు లోకేష్. అదే సమయంలో ఏజ్ మినహాయింపు వ్యవహారం పై సీఎం తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని కూడా వివరించారు లోకేష్.

ఉపాధ్యాయులకు యాప్ ల బాధ లేకుండా చూస్తాం

వచ్చే ఏడాది అకడమిక్ ప్రారంభం అయ్యేలోపు డీ ఎస్ సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ గత ఏడాది ఆరు లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అయ్యారనీ, అదే సమయంలో ఉపాధ్యాయులను వేధిస్తున్న జీ ఓ నెంబర్ 177 కు ప్రత్యామ్నాయ జీ ఓ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అదే సమయంలో ఉపాధ్యాయులను వేధించడం ఈ ప్రభుత్వం లో జరగదనీ, బాత్ రూం ల ఫోటో లు తీసే బాధ ఉపాధ్యాయులకు ఉండదన్న లోకేష్ ఇతర రాష్ట్రాల్లోలా ఎస్టేట్ మేనేజర్ లాంటి వారిని నియమించి విద్యేతర ఇష్యూస్ ను డీల్ చేయాలని చూస్తున్నామాన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులపై డీజీపీ తో చర్చిస్తున్నామన్న లోకేష్ వాటిని కూడా ఎత్తివేసే కార్యక్రమాన్ని చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: 

గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

 విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది