Srisailam Temple: శ్రీశైలం వెళ్లే కర్ణాటక భక్తులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.200 కోట్లతో..

శ్రీశైలం కంబీ మండపం కోసం జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధ రామ శివాచార్య మహా స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,  చైర్మన్ రమేష్ నాయుడు భూమిపూజ చేశారు. శ్రీశైలంలో కర్ణాటక భక్తుల కోసం రూ.200 కోట్ల వ్యయంతో కంబి మండపం యాత్ర నివాస్ వసతి గదులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు..

Srisailam Temple: శ్రీశైలం వెళ్లే కర్ణాటక భక్తులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.200 కోట్లతో..
Bhumi Puja For Srisailam Kambi Mandapam

Edited By: Srilakshmi C

Updated on: Nov 13, 2025 | 8:16 PM

శ్రీశైలం, నవంబర్‌ 13: నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కొత్తగా నిర్మించనున్న కంబి మండపం, 200 గదులతో యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి గురువారం శ్రీకారం చుట్టారు. జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజి ఆధ్వర్యంలో కంబి మండపం యాత్ర నివాస్ కు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు భూమిపూజ నిర్వహించారు. కంబి మండపం భూమిపూజ శంకుస్థాపనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు పాల్గొన్నారు. శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధ రామ శివాచార్య మహా స్వామీజీ ఆధ్వర్యంలో సుమారు రూ.200 కోట్లతో కర్ణాటక భక్తుల కోసం కంబి మండపం యాత్ర నివాస్ వసతి గదులు నిర్మించేందుకు జగద్గురు పీఠాధిపతి శ్రీకారం చుట్టారు. కంబి మండపం యాత్ర నివాస్ వసతి గదుల నిర్మాణానికి అర్చకులు, పీఠాధిపతి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చైర్మన్ రమేష్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఈగలపెంట నుండి శ్రీశైలానికి రోప్ వే వస్తుందన్నారు. పీఎం మోడీతో సీఎం చంద్రబాబు మాట్లాడి శ్రీశైలానికి చెందిన అటవీ భూములను పరిష్కరించనున్నారని ఎమ్మెల్యే అన్నారు. తదనంతరం శ్రీశైలానికి చెందిన అటవీ భూములు కూడా మరింతగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.