మైనర్ బాలికను హోంగార్డ్ 5నెలల గర్భవతిని చేసిన ఘటన మరవక ముందే ఏపీలోని మచిలీపట్నంలో మరో దారుణం జరిగింది. నాలుగు సంవత్సరాల చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. రాడార్ కేంద్రం సమీపంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఘటనపై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ట్రైనీ డీఎస్పీ పి. శ్రావణిని నియమించారు. దీంతో వారు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ ఘటనను బయటకు రానివ్వకుండా నిందితుడి కుటుంబసభ్యులు అడ్డుకున్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.