
తన పార్టీ ఆఫీస్ పై దాడి తరువాత ఆవేదన వ్యక్తపరిచారు మంత్రి విడదల రజిని. ఈ ఘటనను తీవ్రంగా ఖంచించారు. ఆ తరువాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న పాలనలో అందరి కుటుంబాల్లో సంతోషం నెలకొందన్నారు. గుంటూరు వెస్ట్ సమన్వయ కర్తగా జగనన్న తనను నియమించినట్లు చెప్పారు.అన్ని డివిజన్లలో నాయకులందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
గుంటూరు పశ్చిమలో తనకు బలమైన నాయకత్వం ఉందని జగనన్న చెప్పినట్లు వెల్లడించారు. దానిని మరింత బలపరిచి పార్టీని గెలిపించాలని జగనన్న కోరారని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో టీడీపీ రౌడీ, గుండా మూకలు ఏ విధంగా దాడి చేశారో మీరంతా చూశారని న్యూ ఇయర్ వేడుకల ఘటనను గుర్తుచేశారు. అధికార దాహంతో టిడిపి.. బిసి మహిళ అయినా నాపై దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. మీము దాడి చేయలేక కాదు. మా విధానం అది కాదని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..