TTD Degree and Junior Lecturer Jobs: తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు..

TTD Degree and Junior Lecturer Jobs: తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌
TTD Degree and Junior Lecturer Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2024 | 1:49 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత స్పెషలైజేషన్‌లలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు, అర్హతలు ఇలా..

డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49 వరకు ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నెట్‌/ స్లెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

సబ్జెక్టుల వారీ ఖాళీలు ఇలా

  • బోటనీ పోస్టులు: 3
  • కెమిస్ట్రీ పోస్టులు: 2
  • కామర్స్ పోస్టులు: 9
  • డెయిరీ సైన్స్ పోస్టులు: 1
  • ఎలక్ట్రానిక్స్ పోస్టులు: 1
  • ఇంగ్లిష్ పోస్టులు: 8
  • హిందీ పోస్టులు: 2
  • హిస్టరీ పోస్టులు: 1
  • హోమ్ సైన్స్ పోస్టులు: 4
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు: 2
  • ఫిజిక్స్ పోస్టులు: 2
  • పాపులేషన్ స్టడీస్ పోస్టులు: 1
  • సంస్కృతం పోస్టులు: 1
  • సంస్కృత వ్యాకరణం పోస్టులు: 1
  • స్టాటిస్టిక్స్ పోస్టులు: 4
  • తెలుగు పోస్టులు: 3
  • జువాలజీ పోస్టులు: 4

జూనియర్ లెక్చరర్ పోస్టులు మొత్తం 29 ఉన్నాయి. కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఇవి కూడా చదవండి

సబ్జెక్టుల వారీ ఖాళీలు ఇలా..

  • బోటనీ పోస్టులు: 4
  • కెమిస్ట్రీ పోస్టులు: 4
  • సివిక్స్‌ పోస్టులు: 4
  • కామర్స్‌ పోస్టులు: 2
  • ఇంగ్లిష్ పోస్టులు: 1
  • హిందీ పోస్టులు: 1
  • హిస్టరీ పోస్టులు: 4
  • మ్యాథమెటిక్స్‌ పోస్టులు: 2
  • ఫిజిక్స్ పోస్టులు: 2
  • తెలుగు పోస్టులు: 3
  • జువాలజీ పోస్టులు: 2

2024, ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. దరఖాస్తు రుసుము కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250, ఇతరులు రూ.370 చెల్లించవల్సి ఉంటుంది. డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు జీతంగా చెల్లిస్తారు. జూనియర్ లెక్చరర్‌ పోస్టులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు. రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట