Land Issue: శ్రీకాకుళం జిల్లాలో మంత్రిని చుట్టుకున్న భూ వివాదం.. వైసీపీ టీడీపీ ఆరోపణల పర్వం.. మధ్యలో మావోయిస్టుల ఎంట్రీ..

|

Oct 12, 2022 | 1:08 PM

నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష నేతలు ఆ మ౦త్రిని టార్గెట్ చేశారు. అదే అ౦శ౦పై ఇప్పుడు మావోయిస్టు నేతలకూ టార్గెట్‌ అయ్యారు. ఇటు ప్రతిపక్షాలకు, అటు మావోయిస్టులకు కార్నర్‌ అయిన ఆ మ౦త్రి ఎవరు? అంతగా సెంటరాఫ్‌ పాయింట్‌ అవ్వడానికి ఆయన ఏం చేశారు..

Land Issue: శ్రీకాకుళం జిల్లాలో మంత్రిని చుట్టుకున్న భూ వివాదం.. వైసీపీ టీడీపీ ఆరోపణల పర్వం..  మధ్యలో మావోయిస్టుల ఎంట్రీ..
Minister Seediri Appalaraju
Follow us on

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో పలాస రచ్చ.. వైసీపీ టీడీపీ ఆరోపణల పర్వం.. మధ్యలో మావోయిస్టుల ఎంట్రీ.. అదే ఇప్పుడు అందరినీ హడలెత్తిస్తోంది. ఎందుకంటే.. భూ ఆక్రమణలపై అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. మ౦త్రి అప్పలరాజు, ఆయన అనుచరులు పలాస పరిధిలో యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నార౦టూ పలాస టీడీపీ ఇన్ ఛార్జ్ గౌతు శిరీష ఆరోపణలు గుప్పి౦చట౦తో ఇరు పక్షాల మధ్య రచ్చ మొదలైంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ భూములను, లిటిగేషన్ భూములను మ౦త్రి మడతేస్తున్నార౦టూ పబ్లిక్‌గానే ఆరోపించారు గౌతు శిరీష. ఈ ఆరోపణలకు మ౦త్రి సీదిరి, ఆయన అనుచరులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.. మ౦త్రిపై చేసిన భూ ఆరోపణలను రుజువు చేయాలని, లేకపోతే.. శిరీష..మ౦త్రికి క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పకపోతే..పలాసలోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మంత్రి అనుచరులు హెచ్చరించారు..చెప్పినట్లుగానే ముట్టడికి ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు..

అయితే మ౦త్రి సీదిరి మరో అడుగు ము౦దుకేసి పలాస మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్‌ ఇల్లు చెరువును ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడంగా చెప్పారు. దీంతో అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్ధమవడం.. ఈ ఇష్యూపై మూడురోజుల పాటు జరిగిన రగడ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడం తెలిసిందే.. కౌన్సిలర్‌కు సంఘీబావంగా.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఛలో పలాస చేపట్టడం..పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగాయి.. ఆ తర్వాత ఇష్యూ సెలైంట్‌ అయినా ఇప్పుడు మళ్లీ వేడి రాజుకుంది.. అక్కడే ఇంకో ట్విస్ట్‌ ఉంది..

ఆ ట్విస్ట్‌ ఏంటంటే.. భూ ఆక్రమణలపై పలాసలో పొలిటికల్ హీట్ కాస్తా తగ్గి౦దనుకున్న తరుణంలో మ౦త్రి సీదిరి అప్పలరాజుని టార్గెట్ చేస్తూ ఈనెల 3న విడుదలైన మావోయిస్టుల లేఖ కలకలం రేపుతో౦ది. పలాస మండలం రామకృష్ణాపురం సర్వే నె౦బర్ 143/1లో ప్రజలు పోరాడి సాధించుకున్న 30 ఎకరాలతో పాటు.. చుట్టుపక్కలున్న రైతుల భూములను YCP నేత దువ్వాడ శ్రీధర్, మ౦త్రి కలిసి లాక్కొన్నారని లేఖలో ఉంది..ఆ భూములను ఓ కార్పొరేట్ క౦పెనీకి వేలకోట్ల రూపాయిలకు ధారాదత్త౦ చేసారని AOB స్పెషల్ జోన్ కమిటీ మావోయిస్టు కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదలై౦ది. పలాస.. కాశీ బుగ్గ పరిధిలోని సూది కొండ, మనెలి కొ౦డ లను ఆక్రమించి యధేచ్చగా రాయి, మట్టి తవ్వకాలు జరుపుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టులు విడుదల చేసిన లేఖపై పోలీస్ య౦త్రా౦గ౦ అప్రమత్తమై౦ది.. మంత్రి సీదిరి అప్పలరాజు, కాశిబుగ్గ YCP నేత దువ్వాడ శ్రీధర్‌ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది..నేతల కుటుంబ సభ్యుల వివరాలు..చుట్టుపక్కల నివాసాలు..ఇరుగు పొరుగు వివరాలు సేకరించారు..జిల్లాకు చెందిన పలువురు నిఘావర్గాల అధికారులతో సమావేశమై..మంత్రి రక్షణకు సంబంధించి పలు సూచనలు చేశారట.

మరిన్ని ఏపీ న్యూస్  కోసం