Minister Perni Nani: భీమ్లా నాయక్‌పై రాజకీయం చేస్తున్నారు.. చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్

| Edited By: Rajeev Rayala

Feb 25, 2022 | 5:46 PM

Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజా సినిమా భీమ్లా నాయక్(Bheemla Nayak) రిలీజ్ రాజకీయ రంగు పులుముకుంది. పవన్ కళ్యాణ్ సినిమాను..

Minister Perni Nani: భీమ్లా నాయక్‌పై రాజకీయం చేస్తున్నారు.. చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్
Minister Perni Nani
Follow us on

Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజా సినిమా భీమ్లా నాయక్(Bheemla Nayak) రిలీజ్ రాజకీయ రంగు పులుముకుంది. పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేయడం ఏమిటి అంటూ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సినిమాని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఏపీలో సినిమా టికెట్ ధరలపై చంద్రబాబు లోకేష్ లు స్పందించడంపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు సినిమాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు.. ఒక సినిమా రిలీజ్ ఉంటే దాని కోసం తండ్రి, కొడుకులు పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ ధరలను అధికంగా అమ్మకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టాల్సిన వారు ప్రోత్సాహిస్తున్నారు.. సొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడింది ఎవరంటూ ప్రశ్నించారు. అంతేకాదు టీడీపీ జెండాను మోసిన జూ. ఎన్టీఆర్ సినిమాను ఏనాడైనా చంద్రబాబు, లోకేష్ లు పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు.మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోయిన బాధలో మేమున్నాం.. జివో రావడం రెండు రోజులు ఆలస్యమైందని రచ్చ చేస్తున్నారు.. ప్రభాస్, మహేష్, చిరంజీవి సినిమాలకు ఎప్పుడైనా చంద్రబాబు..ట్విట్ చేశారా.. మరి ఇప్పుడు పవన్ సినిమా చూడాలంటూ ఎలా లోకేష్ ట్వీట్ చేస్తారు.. మేము ఇలాంటి రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నాం అని పేర్ని నాని చెప్పారు.

సినిమా బాగుంటే ఎవరు హీరో అయినాచూస్తారు. నాగార్జున  తనయుడు నాగచైతన్య తీసిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి బాగున్నాయి కనుక ప్రేక్షకులు ఆదరించారు… కనుక సినిమాలో దమ్ము ఉంటె బాగా ఆడతాయి. లేదంటే మరో సర్దార్ గబ్బర్ సింగ్, లేదా అజ్ఞాత వాసి అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. నన్ను అఖండ సినిమా రిలీజ్ సమయంలో బాలకృష్ణ కలవడానికి కొంతమందిని పంపించారు.  సీఎం జగన్ తో అపాయింట్మెంట్ ఇప్పించమని కోరారు. ఇది అబద్దమైతే.. ఆయన్ని చెప్పమని అనండి.. నేను అయితే బాలకృష్ణ అబద్దాలు చెబుతారని అనుకోవడం లేదని చెప్పారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబు నాయుడివి అన్నీ దిక్కుమాలిన రాజకీయాలు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి పేర్ని నాని.

జీవో 35 పై ప్రతీ సినిమాకి జాయింట్ కలెక్టర్ దగ్గరకి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హై కోర్టు తీర్పులన్నా.. ప్రభుత్వం అన్నా వీళ్ళకి లెక్క లేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ జనసేన పార్టీలు బ్లాక్ టికెట్స్ ని ప్రోత్సాహిస్తున్నాయని ఆరోపించారు. కొత్త జీవో విడుదల చేయడానికి పక్రియ జరుగుతుంది.. లీగల్ ఒపీనియన్ కి వెళ్ళింది..అన్ని సక్రమంగా జరిగి ఉంటే 24 తేదీన జీవో రావాల్సి ఉందని తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేసుకున్నారు సినిమాని ఇంకో రెండు రోజులు వాయిదా వేసుకోలేరా..జీవో వచ్చే వరకూ ఆగలేరా..? ఏపీలో సినిమాని ప్రీ గా చూపిస్తాను అన్న పవన్ బ్లాక్ టికెట్ల పై ఆశ ఎందుకన్నారు నాని. అసలు జనాలు పవన్ సినిమా ఒక్కటే కాదు.. బాగుంటే అందరి సినిమాలు చూస్తారన్నారు మంత్రి నాని.

Also Read:  లాయర్‌ వింత ప్రవర్తన.. రక్తాన్ని ఫుడ్‌లో ఇంజెక్ట్‌ చేసి, సిరంజీలతో దాడి..