Kodali Nani Vs Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోరాటంపై పవన్ కళ్యాణ్ కు మంత్రి కొడాలి నాని సవాల్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో సంచలనం రేపుతోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి పోరాటం మొదలు పెట్టాయి. మరోవైపు ఇదే అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. వైసీపీ, టీడీపీ వామపక్షాలనేతలు పోరు బాట...
Kodali Nani Vs Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో సంచలనం రేపుతోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి పోరాటం మొదలు పెట్టాయి. మరోవైపు ఇదే అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. వైసీపీ, టీడీపీ వామపక్షాలనేతలు పోరు బాట పట్టారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. కేంద్రంలోని పెద్దలను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ పై చర్చిస్తున్నారు. ప్రైవేటీకరణ వద్దంటూ హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు.
అయితే పవన్ ఢిల్లీ టూర్ పై మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ టూర్ ను ఓ వైపు ఎద్దేవా చేస్తూ మరోవైపు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలందరినీ పవన్ దగ్గరకు పంపిస్తానని.. దమ్ముంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని సవాల్ చేశారు. జనసేన మిత్రపక్షమైన బీజేపీ తో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై స్పందించాలని.. నిజంగా ప్రయివేటీకరణ ఆపాలని జనసేన నేతలు కుంటే పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అంతేకాని దీనిని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని టీడీపీ జనసేనలు చూస్తున్నాయి.. ఇదే మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం.” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అంటూ వైసీపీ అన్ని విధాలా పోరాటాడుతుందని.. తీసుకునే చర్యలు మొదలు పెట్టిందని కొడాలి నాని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్, చంద్రబబు కలిగి నిలదీయాలని సూచించారు.. ఇక తనతో పాటు పోరాటంలో వారిద్దరూ నడుస్తానంటే తానే దగ్గరుండి పోరాటం చేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు.. మరి కొడాలి నాని ఆఫర్స్ కు టిడిపీ, జనసేన అధినేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి
Also Read: