పవన్, బాబు, లోకేష్, అచ్చెన్నపై కొడాలి నాని తిట్లపురాణం: ‘ఉస్కో అంటే డిస్కో’ … అంటూ విమర్శలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఇచ్చిన హామీలన్ని నేరవేర్చుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చూసిన చంద్రబాబు, దొంగ..

  • Venkata Narayana
  • Publish Date - 8:43 pm, Wed, 30 December 20
పవన్, బాబు, లోకేష్, అచ్చెన్నపై కొడాలి నాని తిట్లపురాణం: 'ఉస్కో అంటే డిస్కో' ... అంటూ విమర్శలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఇచ్చిన హామీలన్ని నేరవేర్చుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చూసిన చంద్రబాబు, దొంగ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు మంత్రి కొడాలి నాని. కోర్టులను ఆశ్రయించి పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి, వృద్ధాప్య పింఛన్, పక్కా ఇళ్లు వంటి పథకాలు అమలు చేస్తున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదంటు మాట్లాడుతున్నారన్నారని నాని విమర్శించారు. ఒకరు ప్యాకేజి తీసుకుని సొల్లు కబుర్లు మాట్లాడి వెళ్తున్నాడంటూ పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. తమపై పనికిమాలిన మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు.. ఉస్కో అంటే,  డిస్కో అంటూ వస్తాడని పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేశారు. ‘అచ్చెంనాయుడు 70 రోజులు ఆసుపత్రిలో పడుకున్నాడని.. తాను అయితే పశువుల ఆసుపత్రికి పంపించేవాడిని’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో పప్పు, జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నాడని, పొట్టకోస్తే అక్షరం ముక్క రాని వాడినికని రోడ్లపైకి చంద్రబాబు వదిలారని లోకేష్ ను ఎద్దేవా చేశారు నాని. “చంద్రబాబు.. నువ్వు ఫేక్ ముఖ్యమంత్రి.. నీది ఫేక్ పార్టీ” అంటూ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి… “ఇంకో‌ లింగం ఉన్నాడు.. నేను బొడిలింగం అంటూ విమర్శలు చేస్తున్నావ్.. నువ్వు..’  … లింగానివా” అంటూ నాని విమర్శలు చేశారు. అనంతపురం నుండి ఎటుచూసిన సున్నా సీట్లు వచ్చాయని, పవన్ కళ్యాణ్.. నీవు పెద్ద సున్నా అని నాని వ్యాఖ్యానించారు. ఈ ప్యాకేజీ గాళ్లు, ఈ గుంట నక్కలు, ముఖ్యమంత్రి పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.