Traffic Restrictions in HYD: డిసెంబర్ 31న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ దారుల్లో వెళ్లకుండా చూసుకోండి.
Traffic Restrictions In Hyderabad: న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పడానికి అందరూ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకలకు హైదరాబాద్ నగరం రెడీ అవుతోంది. అయితే..
Traffic Restrictions In Hyderabad: న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పడానికి అందరూ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకలకు హైదరాబాద్ నగరం రెడీ అవుతోంది. అయితే కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నగరంలో ట్రాఫిక్ విషయంలో నగర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలు చేయనున్నారు. బేగంపేట్ ఫ్లై ఓవర్ మినహా.. జంట నగరాల్లోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇక సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సటీ ఫ్లేఓవర్లు, జేఎన్‌టీయూ, మైండ్‌స్పేస్, దుర్గం చెరువు తీగల వంతెనలను కూడా మూసివేయనున్నట్టు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు.. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కార్లు, జీపులను అనుమతించబోమని ప్రకటించారు. వీటితో పాటు నగరంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, బీఆర్‌కే భవన్, తెలుగు తల్లి జంక్షన్, లిబర్టీ జంక్షన్, నల్లగుట్ట రైల్వే వంతెన వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్టు వెల్లడించారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా.. వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. Also Read: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపు అర్ధరాత్రి వరకు క్లబ్‌లు, బార్లకు అనుమతి.!