AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Why Do Earthquakes Occur?: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి..? కారణాలు ఇవేనా..? శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటి..?

Why Do Earthquakes Occur?: ఈ మ‌ధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌తి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌ల ....

Why Do Earthquakes Occur?: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి..? కారణాలు ఇవేనా..? శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటి..?
earthquake hits in Ladakh
Subhash Goud
|

Updated on: Dec 30, 2020 | 8:42 PM

Share

Why Do Earthquakes Occur?: ఈ మ‌ధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌తి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో వ‌రుస భూకంపాలు చోటు చేసుకోగా, ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ సంభ‌వించాయి. ఇక దేశంలోని ప‌లు రాష్ట్రాలు భూకంపాలు పెరిగిపోయాయి. తాజాగా దేశంలో చోటు చేసుకుంటున్న భూకంపాల వ‌ల్ల ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌క‌ పోగా, ప్ర‌జ‌లు భ‌యాందోళ‌నల‌తో ఇళ్ల నుంచి ప‌రుగులు తీయ‌డం, రాత్రి కాగానే టెన్ష‌న్ ప‌డ‌టం జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌కృతి క‌న్ను తెరిచిందంటే చాలు విల‌య‌తాండ‌వం చేస్తుంటుంది. తాజాగా ఇత‌ర దేశాల్లో చోటు చేసుకుంటున్న భూకంపాలు తీవ్ర బీభ‌త్సాన్ని సృష్టిస్తున్నాయి. భ‌వ‌నాలు కుప్ప‌కూలిపోతున్నాయి. దీంతో తీవ్ర‌మైన న‌ష్టాలు చ‌వి చూడాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. భూప్ర‌కంప‌న‌ల కార‌ణంగా క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అస‌లు భూకంపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి..? అందుకు కార‌ణాలు కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు శాస్త‌ర‌వేత్త‌లు.

భూకంపాలు రావడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం కూడా చాలా ఉందంటున్నారు. అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న నీటి వ‌ల్ల‌, అధికమైన భూగ‌ర్భ జ‌లాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయ‌డం, అడవుల్లో చెట్ల‌ను న‌రికివేయ‌డం వంటి వ‌ల్ల భూకంపాలు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

అయితే భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉన్నట్లయితే, ఆ పొర క్రెస్ట్ లేదా లిథోస్పియర్ అంటారు. దాని కింద పొరను మాంటక్ అంటారు. దాని మందం మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొరతో పొలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 8 వేల డిగ్రీల సెల్పియస్. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటిక్, క్రెస్ట్ లను చేధించుకొని బయటకు రావడం కొన్ని చోట్ల జరుగుతుంది. దీన్ని అగ్ని పర్వతం బద్దలైందని అంటుంటారు.

భూమిలో ఉన్న పొరల కదలికలతో అనేక నష్టం

భూమి లోపల చాలా కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు వివ‌రిస్తున్నారు. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే అనేక నష్టం వాటిల్లుతుంది. ఇక అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమిపై పొరైన క్రెస్ట్ 10 నుంచి 12 చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుంది. అయితే భూమిలో 12 పొరలు ఉంటాయని చెబుతున్నారు. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలా ఫలకాలలోని కొన్ని భాగాలలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పటంతో శిలాఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపలు ఏర్పడే అవకాశాలుంటాయ‌ని చెబుతున్నారు. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి.

1906 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సంభవించిన భూకంపంలో రహదారులు, ప్రహరీగోడలు, ఇళ్లు ఇలా అనేకం 20 అడుగుల పక్కకు కదిలిపోయాయి. భారీ ఆనకట్ట వల్ల, అణు ప్రయోగాల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ భూకంపం సమయంలో ధ్వని తప్పనిసరిగా వస్తుంది. సముద్రాలలో కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి.

భూ ప్రకంపనలు నమోదు చేసే సాధనం ఏమిటి..?

భూప్రకంపనలు నమోదు చేసే సాధనాన్ని ‘సిస్మోగ్రాఫ్’ అంటారు. రెండో శతాబ్దంలో చైనాలో తొలిసారిగా సిస్మోగ్రాఫ్ ను తయారు చేశారు. దీనిలో స్ట్రింగ్ ల‌ నుంచి స్థిరంగా వేలాడే బరువు కలిగి ఉంటుంది. దీనికి నాలుగు దిశల చలనాలను నమోదు చేయగల సాధనాలు జత చేసి ఉంటుంది. ఈ సిస్మోగ్రాఫ్ వెనుకాల ఒక అద్దం ఉంటుంది. ఏ కారణంగానైనా భూమి కంపిస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాలు వెనుకున్న అద్దాన్ని కదిలిస్తాయి. ఆ అద్దం నుంచి ప్రతిబింబించే కాంతి కిరణాలు నిత్యం తిరిగే గుండ్రని డ్రిమ్ పైకి ఫోకస్ చేయబడి ఉంటాయి. అవి ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద పడుతూ ఉంటాయి. దీని వల్ల డ్రమ్ మీద ఉండే ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద చలించిన గీతలు ఏర్పడతాయి. ఈ విధంగా భూప్రకంపనలు గుర్తించగల్గుతున్నారు శాస్త్రవేత్తలు.

భూకంప తీవ్రతను ఎలా గుర్తిస్తారు.?

భూకంపాలు వచ్చిన సమయంలో దాని తీవ్రను గుర్తిస్తారు అధికారులు. అయితే భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని అమెరికాకు చెందిన ఛార్లెస్ రిక్టర్ 1935లో కనుగొన్నారు. 3వేల 800 లీటర్ల పెట్రోలు ఇచ్చే శక్తికి సమానమైన శక్తి భూకంపం సందర్భంగా విడుదలవుతుంది. అది రిక్టర్ స్కేలు మీద రూ. 2.5కు సమానం. ఇది ఆరు దాటితో భూకంపం ప్రభావం అధికంగా ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం జంతువులు, పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందే ఉహించగలవని శాస్త్ర‌వేత్త‌లు రుజువు చేశారు. ఇలా భూకంపాలు రావడానికి కారణాలు చాలా మందికి తెలియకపోయినా.. మానవళి చేస్తున్న తప్పిదాల వల్లనే భూప్రకంపనలకు దారి తీస్తుందంటున్నారు.