sitara ghattamaneni : కరోనా టెస్ట్ చేయించుకున్న సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి సితార..
సినిమా ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.
sitara ghattamaneni :సినిమా ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. టాలీవుడ్ లో తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి క్వారెంటైన్ లో ఉన్నారు చరణ్. చరణ్ కు కరోనా సోకిందని ప్రకటించిన కొంత సమయానికే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార కరోనా టెస్ట్ చేయించుకుంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది సితార ఇందుకు సంబంధించిన వీడియోని సితార పోస్ట్ చేసింది. మహేష్ మాదిరిగానే సోషల్ మీడియాలో సితార కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్నారికి కూడా సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. తాను కరోనా టెస్ట్ చేయించుకోవడానికి భయపడ్డానని చెప్పింది సితార. కాని నా పక్కన అమ్మ ఉంది .. నా చేయి పట్టుకొని! మీరు స్నేహితులను కుటుంబ సభ్యులను కలుస్తుంటే పరీక్షలు చేయించుకుని మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోండి. కరోనా టెస్ట్ చేయించుకోడానికి భయపడొద్దు.. తనకు ఎలాంటి నొప్పి రాలేదు.. టెన్షన్ కూడా లేదు.. మన ఆరోగ్యం, సమాజం కోసం అందరూ టెస్టులు చేయించుకోండి ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. స్టే సేఫ్“ అంటూ మెసేజ్ కూడా ఇచ్చింది సితార.
View this post on Instagram
Also read: