kgf chapter 2 : యాక్షన్‌ సన్నివేశాలను చేయలేనని భావించి నన్ను అవమానించకండి : సంజయ్ దత్

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సినిమా ఎంత సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..

kgf chapter 2 : యాక్షన్‌ సన్నివేశాలను చేయలేనని భావించి నన్ను అవమానించకండి : సంజయ్ దత్
Follow us

|

Updated on: Dec 30, 2020 | 8:15 PM

kgf chapter 2 : కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా ఎంత సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ పార్ట్ 2 లో విలన్ అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సంజయ్ అనారోగ్యానికి గురికావడంతో చిత్రయూనిట్ కాస్త కంగారు పడ్డారు. ఇప్పుడు సంజయ్ పూర్తిగా కోలుకొని సెట్ లో జాయిన్ అయ్యారు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నా.. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కొన్ని స్టంట్లకు సంబంధించిన సన్నివేశాలను మార్చరట. అయితే దానికి సంజయ్ నిరాకరించారట. తనకోసం కథలో ఎలాంటి మార్పులు చేయవద్దని దర్శకుడికి సూచించారట సంజయ్. ”యాక్షన్‌ సన్నివేశాలను చేయలేనని భావించి నన్ను అవమానించకండి. ఇంతకుముందుగా అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం. నా కోసం ఎలాంటి మార్పులు చేయకండి. పని విషయంలో ఎలాంటి రాజీపడేది లేదు”అని సంజయ్ అన్నారట. ఇక హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 8 న ఈ సినిమా టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది.

Also read:

Nayanthara : ఆ సినిమాలో నయనతార నటించడంలేదు.. పుకార్లు నమ్మకండి.. క్లారిటీ ఇచిన టీమ్

Latest Articles