Kodali Nani: ‘రాధా బంగారం లాంటి వ్యక్తి’.. మంత్రి కొడాలి నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్

వంగవీటి రాధాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు మంత్రి కొడాలి నాని. వీరిద్దరూ కలవడమే స్పెషల్ అంటే కామెంట్స్ ఇంకాస్త స్పెషల్‌గా ఉన్నాయి.

Kodali Nani: రాధా బంగారం లాంటి వ్యక్తి.. మంత్రి కొడాలి నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్
Radha Kodali Nani

Updated on: Dec 26, 2021 | 7:32 PM

వంగవీటి రాధాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు మంత్రి కొడాలి నాని. రాధా బంగారం లాంటి వ్యక్తి అని చెప్పారు. రాగి కలిస్తేనే బంగారం కూడా కావలసిన ఆకృతిలోకి మారుతుందంటే వినడం లేదని అన్నారు. కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే నడుస్తున్నాడని కొనియాడారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో జరిగిన వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రాధా చేసిన కామెంట్స్‌ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనను హత్యచేయడానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దేనికీ భయపడనని..ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. వంగవీటి రంగా ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానన్నారు వంగవీటి రాధా. తనపై రెక్కీ నిర్వహించిన వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. సరిగ్గా తండ్రి చనిపోయిన రోజు.. ఆయన వర్ధంతిపై నిర్వహిస్తున్న కార్యక్రమంలోనే రాధా తన హత్యకు జరిగిన కుట్రపై కామెంట్స్ చేశారు. పైగా పక్కనే మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. మరి ఈ కామెంట్స్ వ్యూహాత్మకా.. లేక అనుకోకుండా చేశారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

Also Read: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?