Kakani Govrdan Reddy: కోటంరెడ్డి విశ్వాసఘాతకుడు.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వత్తాసు.. మంత్రి కాకాణి ఫైర్..

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆరోపణలు చేస్తున్న శ్రీధర్ రెడ్డి కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానన్న ఆయన.. 6న నెల్లూరు వస్తున్నానని అన్నారు. తన ద్వారా..

Kakani Govrdan Reddy: కోటంరెడ్డి విశ్వాసఘాతకుడు.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వత్తాసు.. మంత్రి కాకాణి ఫైర్..
Kakani Goverdan Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 04, 2023 | 2:53 PM

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆరోపణలు చేస్తున్న శ్రీధర్ రెడ్డి కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానన్న ఆయన.. 6న నెల్లూరు వస్తున్నానని అన్నారు. తన ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి లబ్ధి పొందలేదని తాను ప్రమాణం చేస్తానని, ధైర్యం ఉంటే నువ్వు ప్రమాణం చేస్తావా అని కోటంరెడ్డిని ప్రశ్నించారు. మంత్రి పదవి రాలేదని కోటంరెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్న కాకాణి.. టిక్కెట్ రాదని భావించే నేతలే వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడుతున్నారన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విశ్వాసఘాతకుడు అని ఫైర్ అయ్యారు. ఒక పార్టీ లో గెలిచి.. మరో పార్టీ కి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జగన్ బీఫాం ఇవ్వకపోతే జన్మలో ఎమ్మెల్యే అయ్యేవాడు కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ట్యాపింగ్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తనపై మంత్రి కాకాణి చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. తాను కష్టాల్లో నడిచిన వ్యక్తినని.. ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానే తప్ప పక్కదారులు చూసే మనిషిని కాదని కౌంటర్ ఇచ్చారు. జగన్‌ ఓదార్పు యాత్ర సమయంలో కాకాణి చేసింది గుర్తులేదా అని ప్రశ్నించారు. తనను తిడితే పదవులు వస్తాయనే ఉద్దేశంతో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

వైఎస్ కుటుంబానికి మీరు వీరవిధేయుడైతే వైఎస్‌ విగ్రహాన్ని పెట్టేందుకు ఎందుకు అడ్డుకున్నారు. విధేయత గురించి మీరు మాట్లాడుతుంటే చాలా జాలేస్తోంది. నన్ను తిడితే వైసీపీ ప్రభుత్వంలో పదవులు వస్తాయనుకుంటున్నారు. అందుకే వరస విమర్శలు చేస్తున్నారు. దస్త్రాల చోరీ కేసులో జాగ్రత్తగా ఉండాలని కాకాణికి సలహా ఇస్తున్నా. సజ్జల పేరు వచ్చేసరికి ఉలిక్కిపడి నాపై కాకాణి విమర్శలు చేశారు. మంత్రి పదవి ఇప్పించిన సజ్జలను విమర్శిస్తే కాకాణికి కోపం వచ్చినట్లుంది.

ఇవి కూడా చదవండి

 – కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి, నెల్లూరు రూరల్​ఎమ్మెల్యే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..