Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

ఏపీలోని రైతులకు సంక్రాంతి వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.14 వేలు రైతుల అకౌంట్లో జమ చేయగా.. మూడో విడత విడుదలపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.

Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..
Farmers

Updated on: Jan 05, 2026 | 6:43 AM

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బుల కోసం ఏపీ రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా? అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పంట సీజన్ మొదలు కావడంతో డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు జమ అవుతాయనేది చెప్పేశారు. ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలలో రూ.6 వేలు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.14 వేల చొప్పున జమ చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

ఉల్లి రైతులకు పంట నష్టపరిహారం

కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం డబ్బులు జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 37,752 మంది రైతులకు ఈ నష్టపరిహారం అందించినట్లు తెలిపారు. హెక్టారుకు రూ.50,000 చొప్పున జమ చేశామని, మొత్తం రూ.128.33 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు జమ చేయనుందని తెలుస్తోంది. ఆ నిధులతో పాటే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో పీఎం కిసాన్ నిధుల విడుదల సమయంలోనే వీటిని జమ చేస్తోంది.

అన్నదాత సుఖీభవ పథకం

అటు మంత్రి ఆనం రామనారాయణెడ్డి రెడ్డి ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ డబ్బులను జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఫిబ్రవరిలో ఖాతాల్లోకి నిధులు విడుదల చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పెట్టుబడి కోసం డబ్బులు అందుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అన్నదాత సుఖీభవ పథకం తరపున ఏడాదికి రూ.20 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటిని మూడు విడతలుగా ఇస్తోంది. తొలి రెండు విడతల్లో రూ.7 వేలు, మూడో విడతలో రూ.6 వేలు అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రేషన్ కార్డు, 5 ఎకరాల్లోపు పోలం ఉన్నవారికి మాత్రమే ఈ పధకం వర్తింపచేస్తోంది. అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పధకం కూడా లబ్ది పొందే అవకాశముంది. గ్రామ సచివాలయాల ద్వారా ఈ పథకానికి రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు స్టేటస్‌ను అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.