Ambati Rambabu: పవన్ కళ్యాణ్ వారహి యాత్రపై అంబటి వ్యంగ్యాస్త్రాలు.. కన్ఫ్యూజన్‌లో ఉన్నారంటూ..

Ambati Rambabu: ఏపీలో రానున్న ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఎదుర్కోబోతున్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుతోపాటు ఆయన దత్తపుత్రుడు చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారని, పొత్తులపై వారిలో వారికే క్లారిటీ లేకున్నా...నేనే ముఖ్యమంత్రి అంటూ..

Ambati Rambabu: పవన్ కళ్యాణ్ వారహి యాత్రపై అంబటి వ్యంగ్యాస్త్రాలు.. కన్ఫ్యూజన్‌లో ఉన్నారంటూ..
Ambati Rambabu On Pawan Kalyan

Updated on: Jun 21, 2023 | 5:26 PM

Ambati Rambabu: ఏపీలో రానున్న ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఎదుర్కోబోతున్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుతోపాటు ఆయన దత్తపుత్రుడు చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారని, పొత్తులపై వారిలో వారికే క్లారిటీ లేకున్నా…తానే ముఖ్యమంత్రి అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. ఇంకా పవన్‌కల్యాణ్‌ మాటలవల్లే అతని గ్రాఫ్‌ పూర్తిగా పడిపోతోందన్నారు మంత్రి అంబటి రాంబాబు. సినిమా హీరో వస్తే జనం భారీగా వస్తారని.. అది బలం అనుకుంటే పొరపాటేనని అన్నారు.

అలాగే పవన్‌కు ప్రాణభయం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు అంబటి. పవన్‌ ఎక్కిన వాహనం వారాహి కాదని..అది ఒక పంది అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అంబటి. కాపులను వాడుకొని వదిలేసే పనిలో పవన్‌ ఉన్నారన్నారని, కాపునేత ముద్రగడ పద్మనాభం..పవన్‌కు లెటర్‌ రాయడంలో తప్పేముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాపులకు సమస్యలు వచ్చినప్పుడు ముద్రగడ అండగా నిలిచారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..