ఏపీలో ప్రజలు తమ ఓటు హక్కును యుద్దం చేసి మరి వినియోగించుకున్నారని చెప్పారు టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఇరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారు.. అందుకే కేసీఆర్ గెలిచారని అన్నారు. కానీ ఎలక్షన్ కమీషన్ సారీతో సరిపుచ్చుకుందని విమర్శించారు. ఏపీలో చాలా ఈవీఎంలు పనిచేయలేదన్న ఆయన ‘ఘర్షణలు సృష్టించి జనాన్ని భయపెట్టాలని వైసీపీ భావించందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఏపీకి చాలా ప్రత్యేకమైనవని చెప్పిన ఆయన..మహిళలు టీడీపీకి పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. ఓటర్లు చైతన్యంతో బయటి రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఓట్లు వేశారని చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని అంశాల ప్రభావంతో తెలుగుదేశం భారీ మెజార్టీ తో గెలవనుందని జోస్యం చెప్పారు.
