AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Movie Tickets Issue: రేపు సీఎం జగన్ తో భేటీ కానున్న టాలీవుడ్ పెద్దలు.. టికెట్ ధరల సహా పలు అంశాలపై చర్చించే అవకాశం

AP Movie Tickets Issue: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ముఖ్యమంత్రి జగన్(Cm Jagan) తో రేపు టాలీవుడ్(Tollywood) పెద్దల సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సినిమా టిక్కెట్ ధర, స్పెషల్ షో లపై చర్చించే..

AP Movie Tickets Issue: రేపు సీఎం జగన్ తో భేటీ కానున్న టాలీవుడ్ పెద్దలు.. టికెట్ ధరల సహా పలు అంశాలపై చర్చించే అవకాశం
Chiru And Jagan
Surya Kala
|

Updated on: Feb 09, 2022 | 10:01 AM

Share

AP Movie Tickets Issue: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ముఖ్యమంత్రి జగన్(Cm Jagan) తో రేపు టాలీవుడ్(Tollywood) పెద్దల సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సినిమా టిక్కెట్ ధర, స్పెషల్ షో లపై చర్చించే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), నాగార్జున‌(nagarjuna), ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ సినిమాల నిర్మాతలతో సహా కొంతమంది స్టార్ హీరోలు ఈ పాల్గొన బోతున్నార‌ని సమాచారం. ఈ భేటీలో ఏపీ ప్రభుత్వానికి , చిత్ర పరిశ్రమకు ఉన్న గ్యాప్ భర్తీ కానున్నదని.. ప్రభుత్వం టికెట్ ధరల నిర్ణయంతో పాటు.. టాలీవుడ్ కోరిన వరాలు ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పేదవారికి సినిమా టికెట్ ధర అందుబాటులోకి అంటూ.. థియేటర్ లో టికెట్ ధరలు తగ్గించడంతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరిస్తూ ఏపీ ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేయ‌డంతో స‌మ‌స్య మొద‌లైంది. అంతేకాదు వరసగా సినిమా థియేటర్స్ పై దాడులు చేస్తూ పనులు సినిమా థియేటర్స్ ను క్లోజ్ చేసింది.

అయితే సినిమా టికెట్ల కమిటీ నివేదికపై నేడు ఏపీ ప్రభుత్వం తుది చర్చలు జరపనుంది. జరగనున్నాయి. మంగళవారం సీఎం జగన్‌తో సమావేశమైన మంత్రి పేర్నినాని, సుదీర్ఘంగా సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. అయితే ఇవాళ మరోసారి ఇద్దరు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో గతంలో టికెట్ ధరల విషయంలో తెచ్చిన జీవోని సవ‌రించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది. సగటు ధరలు ఉండేలా నిర్ణయం తీసుకొన్నట్లు స‌మాచారం. పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోకి సైతం అనుమ‌తులతో పాటు.. బెనిఫిట్ షో టికెట్ ధరలతో పాటు, బీ,సీ సెంట‌ర్ల‌లో ఉన్న టికెట్ ధరలను స‌వ‌రించ‌నున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు టాలీవుడ్ కీ , ప్ర‌భుత్వానికీ మధ్య టికెట్ రేట్ల గురించి ఓ అవ‌గాహ‌న కుదిరింద‌ని తెలుస్తోంది. ఈ భేటీలో మళ్ళీ చర్చించి అంగీకారం తెలపనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నంది పురష్కారాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవాకాశం ఉందని తెలుస్తోంది.

Also Read:

ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్ వచ్చేది అప్పుడే.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో హిట్ కొడతానంటున్న యంగ్ హీరో..