Megastar Chiranjeevi: పవన్‌ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమో.. మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమోనంటూ చిరంజీవి పేర్కొన్నారు.

Megastar Chiranjeevi: పవన్‌ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమో.. మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..
Chiranjeevi Pawan Kalyan

Updated on: Oct 04, 2022 | 2:40 PM

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ దసరా కానుకగా బుధవారం (అక్టోబర్‌ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం చిత్ర బృందం స్పెషల్‌ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమోనంటూ చిరంజీవి పేర్కొన్నారు. పవన్‌ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని.. పవన్ లాంటి నిబద్ధత కలిగిన నాయకులు రావాలంటూ ఆకాంక్షించారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని తెలిపారు. తాను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయి సైలెంట్‌గా ఉన్నానన్నారు. అయితే, గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్స్ పై కూడా చిరంజీవి స్పందించారు. ప్రస్తుత నాయకులపై ఎలాంటి సెటైర్లు వేయలేదంటూ స్పష్టంచేశారు. మాతృకలో ఉన్న కథ ఆధారంగానే డైలాగులు రాశామని తెలిపారు. ఈ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేం చేయలేనన్నారు. తాను పాలిటిక్స్ ఎగ్జిట్ అయి సైలెంట్ గా ఉన్నానని.. భవిష్యత్తులో తమ్ముడికి మద్దతు ఇవ్వొచ్చెమోనంటూ చెప్పకనే చెప్పారు. తాను రాజకీయాల నుంచి బయటకు రావడం పవన్ కు ఉపయోగపడుతుందని చిరంజీవి పేర్కొన్నారు.

అసలు గాడ్ ఫాదర్ చిత్రమే.. ఓ రకంగా సైలెంట్‌గా ఉన్న చిరు మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యేందుకు ర్యూట్ మ్యాపా అన్నట్టే కనిపిస్తోంది. ఆయన ఫస్ట్ రిలీజ్ చేసిన డైలాగే సంచలనం సృష్టించింది. రాజకీయాలు నాకు కొత్త కాదంటూ ట్విట్టర్లో రిలీజ్ చేసిన డైలాగ్‌తో ఒక్కసారిగా మెగా పొలిటికల్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. అయితే, చిరు.. తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఓ రకంగా క్లారిటీ ఇచ్చారా..? అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..