Chiranjeevi: రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

|

Oct 01, 2021 | 2:39 PM

మెగాస్టార్ చిరంజీవి రాజమహేంద్రవరంలో సందడి చేశారు. రాజమండ్రి హోమియో వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని

Chiranjeevi: రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
Chiru
Follow us on

Chiru – Rajahmundary: మెగాస్టార్ చిరంజీవి రాజమహేంద్రవరంలో సందడి చేశారు. రాజమండ్రి హోమియో వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం, అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమండ్రితో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. తన సినీ జీవితం ప్రారంభమైందే రాజమండ్రి నుంచి అన్నారు. అల్లు రామలింగయ్యతో తనకున్నది కేవలం మామాఅల్లుళ్ల బంధం మాత్రమే కాదన్నారు చిరంజీవి. తమ మధ్య గురుశిష్యుల అనుబంధం ఉందన్నారు. తెరపై హాస్యాన్ని పండించే అల్లు రామలింగయ్య… జీవితాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకునేవారని గుర్తుచేశారు.

ఇలా ఉండగా, రాజమండ్రి లోని అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని కూడా చిరంజీవి ఆవిష్కరించారు. ఉదయం 10.35 గంటలకు చిరంజీవి మధురవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చిరంజీవి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట ప్రాంతంలో విగ్రహావిష్కరణ చేశారు. చిరంజీవి పర్యటనలో మంత్రులు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూపం, చెల్లుబోయిన వేణుగోపాల్ రావు, ఎంపీలు పిల్లు సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ తో పాటు పలువులు ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు హాజరయ్యారు. ఓ వైపు వైసీపీ ప్రభుత్వానికి జనసేనకు మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి పర్యటనలో వైసీపీ మంత్రులు, నేతలు పాల్గొనడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇక చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో హోమియోపతి కళాశాల కొత్త భవనానికి రూ.2 కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి తెలిసిందే.

Read also: Student Death: పేరెంట్స్‌ అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోన్న చదువులమ్మ ఒడిలో జరిగిన దారుణం