Andhra Pradesh: తక్కువ ధరకే కారు తగిలిందంటూ ఫోన్ కాల్.. లిఫ్ట్ చేయగా క్షణాల్లో సీన్ రివర్స్.!

|

Sep 22, 2022 | 12:30 PM

'మీకు మీషోలో తక్కువ ధరకే కారు బహుమతిగా తగిలింది.. ఒక చిన్న మొత్తం చెల్లిస్తే.. దాన్ని మీరు పొందొచ్చు' అంటూ ఓ వ్యక్తి ఫోన్ కాల్

Andhra Pradesh: తక్కువ ధరకే కారు తగిలిందంటూ ఫోన్ కాల్.. లిఫ్ట్ చేయగా క్షణాల్లో సీన్ రివర్స్.!
Representative Image
Follow us on

‘మీకు మీషోలో తక్కువ ధరకే కారు బహుమతిగా తగిలింది.. ఒక చిన్న మొత్తం చెల్లిస్తే.. దాన్ని మీరు పొందొచ్చు’ అంటూ ఓ వ్యక్తి ఫోన్ కాల్ వచ్చింది. అతడు ఆ మాటలను నమ్మి కొంత డబ్బు చెల్లించగా.. అసలుకే మోసం వచ్చింది. క్షణాల్లో సీన్ కాస్తా రివర్స్ అయింది. కట్ చేస్తే సదరు వ్యక్తి చివరికి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపురం జిల్లా పుట్లూరుకి చెందిన ఓ వ్యక్తి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి సుమారు రూ. 15 లక్షలు పోగొట్టుకున్నాడు. ‘మీషోలో మీకు కారు బహుమతి తగిలిందని.. తక్కువ మొత్తం చెల్లించి దాన్ని పొందవచ్చునని’ బాధితుడితో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్‌లో మాయమాటలు కలిపారు. వారి మాటలు నమ్మిన సదరు వ్యక్తి సుమారు రూ. 15 లక్షలు చెల్లించాడు. తీరా చూసేసరికి మొత్తం మోసం అని అతడికి అర్ధమైంది. దీంతో బాధితుడు స్థానిక పోలిసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాడు.

కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఆఫర్‌లో బహుమతులు తగిలాయంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని.. అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తే.. వెంటనే 1930 నెంబర్‌కు సమాచారం అందించాలని ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అంతేకాకుండా లోన్ యాప్స్ విషయంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.