Vijayawada: భర్త వద్దన్నా వినకుండా ఆ యాప్‌లో లక్షల పెట్టుబడి.. చివరకు మోసపోయానని తెలియడంతో..
కాయ్ రాజా కాయ్... అంటూ ఆన్‌లైన్‌లో కూడా తయారైపోయారు కోతలరాయుళ్లు. ఆకర్షణీయమైన పేర్లతో యాప్‌లు పెట్టి... అమాయకుల్ని ట్రాప్‌లోకి దింపడం వీళ్ల పని. జరుగుతున్నది మోసమని తెలీక... సరెండరైపోవడం.. ఆ తర్వాత సర్వస్వం సమర్పించుకోవడం. ఈ తంతు కూడా రొటీనైపోయింది. లేటెస్ట్‌గా మరో అభాగ్యురాలు... ఈ యాప్‌ల బారిన పడి.. ఎటో వెళ్లిపోయింది.
ఆన్‌లైన్ లోన్ యాప్స్… ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్… ఆన్‌లైన్ ఇన్‌వెస్ట్‌మెంట్ స్కీమ్స్… చదువుకోనివాళ్లనే కాదు… చదువుకున్నవాళ్లను కూడా ట్రాప్ చేస్తున్నాయి. నిండా ముంచి… నిండు ప్రాణాలు తీసేస్తున్నాయి. ఆన్‌లైన్ మోసాలకు దొరికిపోకండి… నిలువుదోపిడీ సమర్పించుకోకండి మొర్రో అని ప్రభుత్వ యంత్రాగాలు, మీడియా ఎంత అప్రమత్తం చేసినా… ప్రయోజనం లేకుండా పోతోంది. ఆన్‌లైన్ మోసాలకు నిండు జీవితాల్ని బలిచ్చుకుంటున్న వారి జాబితాలో లేటెస్ట్ ఎంట్రీ హిమబిందు… కేరాఫ్ బెజవాడ. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న హిమబిందు… ఇప్పుడు ఎక్కడుంది… ఏమైపోయింది… తెలీక లబోదిమంటున్నారు కుటుంబీకులు.
సీతారామపురంలో టెకీ హిమబిందు మిస్సింగ్… మిస్టరీగా మారింది. గత నెల 31న హిమబిందు అదృశ్యమైంది. 10రోజులు గడిచినా ఆచూకీ దొరకలేదు. ఇంతకీ ఏం జరిగింది… ఆమె అదృశ్యానికి దారితీసిన కారణాలేంటి అని ఆరా తీస్తే… బ్యాక్‌డ్రాప్‌లో ఒక మాయదారి యాప్ కనిపిస్తోంది. యాప్ నామధేయం వాషింగ్టన్ ఫిల్మ్ స్క్వేర్. పేరే వెరైటీగా ఉంది. ఇది నకిలీ యాప్… మోసపోవద్దని ఓవైపు అనిపిస్తున్నా… దాని మాయలో పడిపోయింది హిమబిందు. విడతలు విడతలుగా 7 లక్షలు చెల్లించుకుంది. కంపెనీ నుంచి సడన్‌గా రియాక్షన్ ఆగిపోవడంతో… మోసపోయినట్లు నిర్ధారించుకున్న హిమబిందు… మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
నకిలీ యాప్‌లో డబ్బులు పెట్టొద్దని భర్త నాగ కృష్ణ ప్రసాద్ చెప్పినా ససేమిరా అంటూ లక్షలాది రూపాయలు సమర్పించుకుంది. నిండా మునిగానని తెలుసుకుని… ఫ్యామిలీలో మొహం చూపించుకోలేక.. కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ హిమబిందు ఎక్కడైనా ప్రాణాలతోనే ఉందా లేక… బలవన్మరణానికి పాల్పడిందా అనేది మిస్టరీగా మారింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిసి ఫుటేజ్ పరిశీలించి హిమబిందు కదలికల్ని ట్రేసౌట్ చేశారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని… ఆందోళన చెందుతున్నారు కుటుంబీకులు. ప్రస్తుతానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి… హిమబిందు ఆచూకీ కోసం ట్రై చేస్తున్నారు పోలీసులు.
పేరులోనే సినిమాటిక్ ఫ్లేవర్లున్న ఈ యాప్ గురించి కూడా లోతుగా ఆరా తీస్తున్నారు. ఆన్‌లైన్లో అమాయకుల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు… ఇంకా ఎంతమందిని మోసపుచ్చారన్న డీటెయిల్స్ కోసం సెర్చ్ జరుగుతోంది. అటు… హిమహిందు కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..