పవిత్ర శ్రీవారి క్షేత్రంలో రాజకీయ ఆరోపణలు, విమర్శలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. . కుమారుడి వివాహ వేడుకల అనంతరం ఆయన మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా శ్రీవారి దర్శనానికి వచ్చే రాజకీయ నాయకులు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా టీటీడీ గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
‘తిరుమల శ్రీవారి క్షేత్రం చాలా పవిత్రమైనది. అలాంటి చోట రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదు. కానీ కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రచారం కోసం తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అలాంటి వారిపై టీటీడీ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే శ్రీవారి క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడకుండా నిషేధం విధించాలి’ అని బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ మధుర భాష్యంతో మధురమైన జీవనం గడిపేలా పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు.
Minister Anil Kumar Yadav: సీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్