Dharmavaram: ఉన్నఫలంగా మాట్లాడలేని స్థితికి చేరుకున్న వ్యక్తి.. ఆస్పత్రిలో టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
అప్పటిదాకా అతడికి అనారోగ్యం ఏం లేదు. కానీ కొద్ది రోజులుగా కడుపు నొప్పి వెంటాడుతుంది. మందులు వేసుకున్నా తగ్గట్లేదు. గ్యాస్ వల్ల ఏమో తగ్గుతుంది లే అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ ఏకంగా మాటలు రాని స్థితికి చేరుకోవడంతో కంగారుపడ్డారు.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడు. తెలిసిన ఆర్ఎంపీ వద్ద మందులు వాడుతున్నా కూడా ప్రయోజనం లేకపోయింది. అయితే ఇటీవల ఉన్నఫలంగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ప్రవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేసి డాక్టర్లు.. రిపోర్టులు చూసి స్టన్ అయ్యారు. అతడి కడుపులో గొలుసు ఉన్నట్లు గుర్తించారు. ఏంటా అని ఎంక్వైరీ చేయగా అది అతని భార్య బంగారపు నల్లపూసల గొలుసు అని తేలింది.
ఆపరేషన్ చేసి.. ఆ చెయిన్ బయటకు తీయాలిని ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. అంత డబ్బు పెట్టే స్థోమత లేకపోవడంతో… బాధితుడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి ఆపరేషన్ లేకుండా.. నోటి ద్వారా చెయిన్ బయటకు తీశారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సుకుమార్. దీంతో బాధిత కుటుంబ సభ్యులు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అతడు గొలుసు ఎందుకు మింగాడు అన్నది తేలాల్సి ఉంది. మానసిక స్థితి బాలేదా..? లేదా చెయిన్ కొట్టేసే క్రమంలో మింగేశాడా అన్న విషయంలో బాధితుడు రికవరీ అయ్యి.. కాస్త మాట్లాడే శక్తి వచ్చాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




