AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏంట్రా ఇలా ఉన్నారు.. సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఎంతకు తెగించాడంటే..

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో దారుణం చోటుచేసుకుంది. తనకు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఓ వ్యక్తి ఏకంగా కిరాణా షాపు యజమానిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయాలకే పెరిగిపోతున్న హింసకు ఈ ఘటన నిదర్శనం..

Andhra: ఏంట్రా ఇలా ఉన్నారు.. సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఎంతకు తెగించాడంటే..
Mudigubba Crime News
Nalluri Naresh
| Edited By: |

Updated on: May 07, 2026 | 3:27 PM

Share

సొసైటీలో కొంతమంది మరీ దారుణంగా తయారయ్యారు. చిన్న చిన్న విషయాలకే.. కిరాతకంగా మారుతున్నారు. పది రూపాయల కోసం హత్యలు.. చిన్న మాటకే హత్యలు చేసే వారి గురించి వింటున్నాం.. చూస్తున్నాం.. తాజాగా, అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది.. సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని కిరాణా షాప్ యజమాని పై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.. ఈ దారుణ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో జరిగింది. ముదిగుబ్బ మండల కేంద్రంలో మణికంఠ అనే వ్యక్తి కిరణా దుకాణం యజమాని.. ఎప్పటిలా కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.. ఈ క్రమంలో మణికంఠ కిరణా షాప్ లో వసంత్ కుమార్ అనే డ్రైవర్ 200 రూపాయలు అప్పు ఉన్నాడు.

200 రూపాయల అప్పు అలా ఉండగానే.. సిగరెట్ అప్పుగా కావాలని డ్రైవర్ వసంత్ కుమార్ అడిగాడు.. అయితే.. గతంలో ఇవ్వాల్సిన 200 రూపాయలు ఇవ్వాలని షాపు యజమాని మణికంఠ తల్లి డ్రైవర్ వసంత్ కుమార్ ను అడిగింది. దీంతో డ్రైవర్ వసంత్ కుమార్ షాప్ యజమాని తల్లితో గొడవకు దిగాడు. మాట మాట పెరగడంతో.. అడ్డువచ్చిన షాపు యజమాని మణికంఠ పై డ్రైవర్ వసంత కుమార్ కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ కిరాణా షాపు ఓనర్ మణికంఠను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మణికంఠకు చికిత్స అందిస్తున్నారు.

గతంలో ఉన్న బాకీ 200 రూపాయలు చెల్లిస్తేనే సిగరెట్ ఇస్తానన్నందుకు.. కత్తితో పొడిచినట్లు కిరాణా షాప్ యజమాని మణికంఠ చెబుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కేవలం సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని దాడి చేయడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్