Eluru News in Telugu: హిందూ సాంప్రదాయంలో పురాణాల నుంచి కూడా పెళ్ళిలో భర్త భార్యకు కట్టే తాళి బొట్టు కు ఒక ప్రత్యేకత ఉంది. వేద మంత్రాలు మధ్య తాలి కట్టడం ద్వారా పురుషుడు ఆ మహిళను అర్ధాంగిగా స్వీకరించినట్లు భావిస్తారు. మహిళలు పరమ పవిత్రంగా భావించే మంగళ సూత్రాలు జారవిడుచుకుంటే ఆ తాళి కట్టిన భర్తకు అపాయంగా భావిస్తారు హిందూ స్త్రీలు. అటువంటి అ మంగళ సూత్రాలను జారవిదుచుకుంటే ఆమహిల మనో వేదన చెప్పరానిది.
అయితే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామానికి చెందిన డమ్మేటి నాగమణి గంగాధరరావు దంపతులు దొమ్మేటిలు పాలకొల్లు వెళుతుండగా మార్గ మధ్యలో మంగళ సూత్రాలు జారి పడిపోయాయి. ఇంటికి వెళ్ళాక చూసుకున్న దంపతులు తాము వెళ్లిన దారిలో ఎంతగా వెతికినా కనిపించక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సెంటిమెంట్‌గా భావించే మంగళ సూత్రాలు పోవడంతో ఆ గృహిణి తమ ఇంట్లో ఏమి అశుభం జరుగుతుందోనని ఆవేదన చెందుతుంది.
కాగా తన భార్య ఆవేదన చూడలేని ఆమె భర్త గంగాధరరావు.. ఎవరికైనా మంగళ సూత్రాలు దొరికితే తమకు ఇవ్వాలని కోరుతూ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి పలు కోడళ్ళులో పెట్టారు. దీంతో రోడ్డుపై వెళ్లే వారు ఈ ఫ్లెక్స్‌ను చూసి సదరు మహిళ మంగళసూత్రాలు దొరకాలని, దొరికిన వారు వారికి అందజేయాలని ప్రార్థిస్తున్నారు.
-బి. రవి కుమార్, TV9 Reporter, Eluru
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..