AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..

తన జీవిత భాగస్వామితో స్నేహితుడు క్లోజ్‌గా ఉండటాన్ని సహించలేకపోయాడు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. రెండు రోజుల పాటు నేరుగా ఇంటికే వెళ్లాడు. చివరికి కుటుంబ సభ్యులు చూస్తుండగానే కసిదీరా పొడిచేశాడు. అడ్డుకోబోయిన స్నేహితుడు కూతురుపై కూడా కత్తి దూశాడు. దీంతో స్థానికులు దేహశుద్ది చేయడంతో అక్కడ నుండి పారిపోయాడు.

Andhra: భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
Crime News.
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 03, 2025 | 7:19 PM

Share

తన జీవిత భాగస్వామితో స్నేహితుడు క్లోజ్‌గా ఉండటాన్ని సహించలేకపోయాడు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. రెండు రోజుల పాటు నేరుగా ఇంటికే వెళ్లాడు. చివరికి కుటుంబ సభ్యులు చూస్తుండగానే కసిదీరా పొడిచేశాడు. అడ్డుకోబోయిన స్నేహితుడు కూతురుపై కూడా కత్తి దూశాడు. దీంతో స్థానికులు దేహశుద్ది చేయడంతో అక్కడ నుండి పారిపోయాడు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్త రెడ్డి పాలెంకు చెందిన మీరా వలి.. సుద్దపల్లి డొంకు చెందిన గోపి ఇద్దరూ స్నేహితులు.. కలిసి తాపిమేస్త్రిలుగా పనిచేస్తున్నారు. మీరావలి వద్దకు కొన్నేళ్ల క్రితం గోపి వచ్చాడు. అప్పటి నుండి పని నేర్పించడమే కాకుండా తాను చేస్తున్న భవన నిర్మాణంలోనే మేస్త్రిగా అవకాశం ఇచ్చాడు. దీంతో ఇద్దిరి స్నేహం మరింత బలపడింది. అయితే ప్రస్తుతం మీరావలి కొత్త రెడ్డి పాలెంలోనే భవన నిర్మాణం చేస్తున్నాడు. గోపి మేస్త్రిగా ఆ పనికి ప్రతిరోజు వస్తున్నాడు.

ఈ క్రమంలోనే గోపి మీరావలి ఇంటికి వచ్చి పోతున్నాడు. గోపి మొదట్లో ఇంటికి వచ్చి పోతున్నా పట్టించుకోని మీరావలి.. కొద్ది కాలం తర్వాత గోపిపై అనుమానం మొదలైంది. తన భార్యతో చనువుగా ఉన్నట్లు గ్రహించాడు. అప్పటి నుండి గోపిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. దీంతో రెండు రోజుల నుండి గోపి కోసం సుద్దపల్లి వచ్చి వెలుతున్నాడు. గోపి కోసం మీరావలి గతంలో కూడా ఇంచికి వచ్చి వెళ్లేవాడు. ఆ విధంగానే మీరావలి వస్తున్నట్లు గోపి కుటుంబ సభ్యులు భావించారు. గోపి కోసం మీరావలి రావడం, గోపి లేకపోవడంతో వెళ్లిపోవడం జరుగుతుంది.

Ap Crime News

Ap Crime News

అయితే సోమవారం సాయంత్రం మీరావలి వచ్చిన సమయంలో అదే బజార్ లో గోపి కనిపించాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో మీరావలి దాడి చేసి విచక్షణారహితంగా పొడిచేశాడు. అక్కడే సమీపం నుండి ఇదంతా చూస్తున్న గోపి కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడి చేయబోయాడు. వెంటనే స్థానికులు స్పందించి మీరావలికి దేహశుద్ది చేశారు. దీంతో అక్కడ నుండి సమీప గుట్టలోకి పారిపోయి దాక్కున్నాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి మీరావలిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్