Andhra Pradesh: సరాదాగా బీరు తాగేందుకు ఊరు బయకుట వెళ్లిన నలుగురు స్నేహితులు.. మాట మాట పెరిగి..

|

Jun 10, 2023 | 11:46 AM

సరాదాగా బీరు తాగుదామని నలుగురు స్నేహితులు ఊరు బయటకు వెళ్లారు. మద్యం సేవించారు. అయితే అంతలోనే తాగిన మత్తులో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య మొదలైన ఘర్షణ... ఒకరి మృతికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. అరండల్ పేటకు చెందిన రమేష్, వెంకటేష్..

Andhra Pradesh: సరాదాగా బీరు తాగేందుకు ఊరు బయకుట వెళ్లిన నలుగురు స్నేహితులు.. మాట మాట పెరిగి..
Representative Image
Follow us on

సరాదాగా బీరు తాగుదామని నలుగురు స్నేహితులు ఊరు బయటకు వెళ్లారు. మద్యం సేవించారు. అయితే అంతలోనే తాగిన మత్తులో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య మొదలైన ఘర్షణ… ఒకరి మృతికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. అరండల్ పేటకు చెందిన రమేష్, వెంకటేష్.. చిన పలకలూరికి చెందిన కార్తీక్, మునాఫ్ నలుగురు స్నేహితులు. మద్యం సేవించేందుకు నలుగురు కలిసి ఊరు బయటకు వెళ్లారు. అక్కడే వెంట తీసుకెళ్లిన బీర్లను సేవించారు. ఈ క్రమంలోనే మొదట సరదాగా ఉన్న తర్వాత వారి మద్య డబ్బుల విషయం వచ్చింది.

తీసుకున్న మద్యం మత్తు ఎక్కడంతో వెంకటేష్ గతంలో తనకు రావాల్సిన డబ్బులు గురించి రమేష్ ను అడిగాడు. కూలీ చేయించుకొని డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రమేష్ కోపంతో వెంకటేష్ ని బండ బూతులు తిట్టాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ మండిపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ పెద్దదైంది. రమేష్ బూతులు తిట్టడంతో హర్ట్ అయిన వెంకటేష్ తన చేతిలో ఉన్న బీరు బాటిల్ తో రమేష్ కాలుపై పొడిచాడు. దీంతో రమేష్ తన చేతిలో ఉన్న బాటిల్ తో వెంకటేష్ తలపై బాదాడు.

దీంతో ఇద్దరి మధ్య పెద్ద కొట్లాట జరిగింది. వెంకటేష్ ను మందలిస్తూ ముగ్గురు ఒక్కటయ్యారు. వెంకటేష్ పై అందరూ కలిసి దాడి చేశారు. ఈ దాడిలో వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడు. వెంకటేష్‌ చనిపోయాడన్న విషయం అర్థమవటంతో ముగ్గురు అక్కడ నుండి వెళ్లిపోయారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా కూలీ పని చేసుకొని జీవిస్తూ బాధ్యత లేకుండా తిరుగుతుంటారని పోలీసులు చెప్పారు. ఈక్రమంలో తాగడం, ఘర్షణలకు దిగుతుంటారని నల్లపాడు సిఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.