Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుకు గురైన వ్యక్తి.. తమ్ముడితో కలిసి సరదాగా వెళ్లి,.. అనంతలోకాలకు

|

Dec 17, 2022 | 4:31 PM

శ్రీనుకి భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. సినిమాకి వెళ్లిన అతను.. విగతజీవుడై ఇంటికి రావడంతో.. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లల రోదనలు మిన్నంటాయి.

Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుకు గురైన వ్యక్తి.. తమ్ముడితో కలిసి సరదాగా వెళ్లి,.. అనంతలోకాలకు
While Watching Avatar 2
Follow us on

ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు అనేకం చూస్తున్నాం. తాజాగా, మరో సంఘటన చోటు చేసుకుంది. సినిమా చూస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురైన మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఇటీవల విడుదలైన ‘అవతార్ 2’ సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన పెద్దాపురం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు లక్ష్మీరెడ్డి శ్రీనుగా గుర్తించారు. ఇటీవల విడుదలైన అవతార్ 2 సినిమా చూసేందుకు శ్రీను తన సోదరుడు రాజుతో కలిసి పెద్దాపురం వెళ్లినట్లు సమాచారం. సినిమా చూస్తుండగా శ్రీను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని అతని సోదరుడు చెప్పాడు. వెంటనే పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీను మృతితో వారింట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

శ్రీనుకి భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. సినిమాకి వెళ్లిన అతను.. విగతజీవుడై ఇంటికి రావడంతో.. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లల రోదనలు మిన్నంటాయి.

అటు, తైవాన్‌లో 42 ఏళ్ల వ్యక్తి 2010లో విడుదలైన ‘అవతార్’ చిత్రం మొదటి భాగాన్ని చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు.
ఇకపోతే, అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 2009లో విడుదలైన అవతార్‌కి సీక్వెల్. 13 సంవత్సరాలు నిర్మాణంలో ఉంది. 2500 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు జేమ్స్ కామెరూన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి