Andhra News: చిన్నారి రామ్ చరణ్‌ను రక్షించిన సీసీ కెమెరా.. ఎలాగో తెలుసా..

వారసుడి కోసం బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. చివరకు.. ఓ సీసీ కెమెరా అతని జాడను గుర్తించేలా సహాయపడింది.. దీంతో పోలీసులు కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. బాలుడిని రక్షించారు.. ఆసుపత్రి వద్ద బాలుడితో కలిసి అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు.. మునిస్వామిని అదుపులోకి తీసుకున్నారు..

Andhra News: చిన్నారి రామ్ చరణ్‌ను రక్షించిన సీసీ కెమెరా.. ఎలాగో తెలుసా..
Crime News

Edited By:

Updated on: Jan 20, 2025 | 11:30 AM

వారసుడి కోసం బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. చివరకు.. ఓ సీసీ కెమెరా అతని జాడను గుర్తించేలా సహాయపడింది.. దీంతో పోలీసులు కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. బాలుడిని రక్షించారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవనకొండ మండలం పుల్లాపురం గ్రామానికి చెందిన మునిస్వామి అనే వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు.. వారసుడు కంటే మగపిల్లవాడు (వారసుడు) లేడనే ఉద్దేశంతో ఎమ్మిగనూరులో ఈ నెల 17న రాంచరణ్ అనే బాలుడిని మునిస్వామి కిడ్నాప్ చేశాడు..

ఎమ్మిగనూరులో జాతరను చూసేందుకు దంపతులు రామాంజి నాగవేణి వచ్చారు.. అయితే.. ఐదేళ్ల కొడుకు రామ్ చరణ్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ వైరల్ కావడంతో నిందితుడి వివరాలు, ఆచూకీ పోలీసులకు లభించాయి. కిడ్నాప్ చేసిన వ్యక్తి మునిస్వామిగా గుర్తించారు. పిల్లవాడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాలని లేకుంటే ఇబ్బందులు పడతావని, పోలీసులు గాలిస్తున్నారని కొందరు ఫోన్ ద్వారా హెచ్చరించడంతో ఆదివారం ఉదయం మునిస్వామి ఎమ్మిగనూరు చేరుకున్నాడు.

వీడియో చూడండి..

మునిస్వామి బాలుడితో కలిసి ఆసుపత్రి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. సీసీ కెమెరా బాలుడిని రక్షించిందని, పోలీసులు కేసును ఛేదించడంలో సహాయపడిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..