తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కో ప్రాంతం ఒక్కో వంటకానికి సుప్రసిద్ధం. హైదరాబాద్-బిర్యానీ, అంకాపూర్-చికెన్, కాకినాడ-కాజా, బందరు-లడ్డు ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇవన్నీ అందరికీ సుపరిచితమైన రుచులే. అయితే కొన్ని ప్రాంతాల్లో లోకల్ రుచులు కూడా భోజన ప్రియులను చవులూరిస్తాయి. ఆ రుచి అక్కడ మాత్రమే దొరుకుతూ ఊరిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎర్రటి మంటపై కాల్చిన చికెన్ చీకులు నోరూరిస్తున్నాయి. వెదురు పుల్లలకు చిన్న చిన్న మాంసపు ముక్కలను గుచ్చి, వాటికి నిమ్మరసం, మసాలాలు అద్ది నిప్పు కణికలపై కాల్చుతున్నారు. ఈ పంటకం స్థానికంగా ఈవినింగ్ స్నాక్ గా పేరొందింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చికెన్ చీకులు లభిస్తున్నా నరసన్నపేట చీకులది మాత్రం ప్రత్యేక రుచి అంటున్నారు మాంసాహార ప్రియులు. వీటిని ఆరగించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచీ వస్తున్నారు.
మాంసపు ముక్కల్ని చిన్నగా ఒకటే సైజ్‌లో కట్ చేస్తారు. వాటిని మసాలా, కారం ఇతర పదార్థాలతో చేసిన మిశ్రమంలో నాలుగు గంటల సేపు ఉంచుతారు. తరువాత వెదురుపుల్లలకు ఈ ముక్కల్ని గుచ్చి.. ఎర్రగా కాలుతున్న బొగ్గులపై పెడతారు. 10 నిమిషాలు సేపు బాగా ఉడికిన తరువాత వడ్డిస్తారు. చికెన్ చీకుల తయారీకి స్థానికంగా లభించే కారం, మసాలా దినుసుల్నే వినియోగిస్తామని తయారీ దారులు చెబుతున్నారు. మార్కెట్‌లో లభించే కృత్రిమ మసాలాలు గానీ, హానికరమైన రంగులు, ఇతర పదార్థాలను వాడమని అందుకే వీటికి అంత రుచి వస్తుందని అంటున్నారు.
ఇవీ చదవండి.
Pigeon Racing: ఏపీలో జోరుగా పావురాల రేస్ బెట్టింగ్.. చెన్నై నుంచి 4 లారీల్లో పావురాల దిగుమతి..
Telangana Politics: ‘సీఎం సార్.. మా గురించి కూడా అలోచిండండి’.. ఆ ఇద్దరు నేతల ఎదురుచూపులు..
PM Modi – Lata Mangeshkar: ఇవాళ సాయత్రం లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని మోదీ..