Andhra Pradesh: పట్టపగలే ఘరానా మోసం.. ఇంటికి గాలి, ధూళి పట్టింది మంత్రాలు వేస్తామంటూ..

| Edited By: Surya Kala

Oct 29, 2023 | 9:18 PM

ప్రకాశంజిల్లా పొదిలి పట్టణంలో పట్టపగలే ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటికి పీడ పట్టింది.  పూజలు చేసి వదిలిస్తామంటూ ఐదుగురు సభ్యుల ముఠా సభ్యులు హల్‌చల్‌ చేశారు. పొదిలిలో పట్టపగలే ప్రార్థనలు చేస్తామని ఓ ఐదుగురు వ్యక్తులు పడమటిపాలెం మసీదుతోటలోని వీధిలోకి ఎంటరయ్యారు. ఒక ఇంట్లోకి చొరబడి మీఇంటికి పీడ పట్టింది.

Andhra Pradesh: పట్టపగలే ఘరానా మోసం.. ఇంటికి గాలి, ధూళి పట్టింది మంత్రాలు వేస్తామంటూ..
Prakasam
Follow us on

దువా చేస్తాం.. దవా ఇస్తాం..  మాయా లేదు, మర్మం లేదు.. అంతా తాయత్తు మహిమ..  అంటూ అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న కర్నాటక ముఠా ఉదంతం వెలుగులోకి వచ్చింది.  ప్రకాశంజిల్లా పొదిలిలో ఓ ఇంట్లోకి వెళ్ళి ఇంటికి పీడ పట్టిందని, వదిలిస్తామంటూ ఐదుగురు ముఠా సభ్యులు డబ్బులు కాజేయడంతో అప్రమత్తమైన ఇంటి యజమాని స్తానికుల సాయంతో ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు పరారయయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రకాశంజిల్లా పొదిలి పట్టణంలో పట్టపగలే ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటికి పీడ పట్టింది.  పూజలు చేసి వదిలిస్తామంటూ ఐదుగురు సభ్యుల ముఠా సభ్యులు హల్‌చల్‌ చేశారు. పొదిలిలో పట్టపగలే ప్రార్థనలు చేస్తామని ఓ ఐదుగురు వ్యక్తులు పడమటిపాలెం మసీదుతోటలోని వీధిలోకి ఎంటరయ్యారు. ఒక ఇంట్లోకి చొరబడి మీ ఇంటికి పీడ పట్టింది. ప్రత్యేక ప్రార్థనలు చేసి వదిలిస్తాం.  దువా చేసి, దవా ఇస్తాం. అంటూ మాయమాటలు చెప్పారు.

అనారోగ్యంతో ఉన్న ఆ ఇంట్లోని మహిళకు పట్టిన గాలి, ధూళి ఈ దెబ్బకు వదిలిపోతుందని నమ్మించారు.  అందుకోసం 11 వేల రూపాయలు ప్రార్దనలు చేసే సమయంలో ఉంచాలని, ప్రార్ధనల అనంతరం అవి తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మబలికారు. ప్రార్ధనలు చేసే సమయంలో బాధిత మహిళ మాత్రమే ఉండాలని చెప్పారు.  దీంతో వరండాలో బాధిత మహిళ ఒక్కతే ఉన్న సమయంలో పథకం ప్రకారం నెమలి ఈకలలో మత్తుమందు చల్లారు. మత్తు ప్రభావంతో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో ప్రార్థన కోసం ఇచ్చిన 11వేల రూపాయలు తీసుకుని పరారయ్యారు. వీరి వ్యవహారాన్ని గమనించిన ఇంట్లోని మిగిలిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. పారిపోతున్న ఐదుగురు దొంగల ముఠాను వెంటాడారు.  వీరిలో ఇద్దరు దొరకడంతో పోలీసులకు అప్పగించారు. మిగిలిన ముగ్గురు దొంగలు పరారయ్యారు. మొత్తం ఐదుగురు ముఠా సభ్యులు వచ్చారని, వీళ్ళంతా కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాలి, ధూళి సోకిందని మాయమాటలు చెప్పి మోసం చేసే ముఠాల గురించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..