Madanapalle murders: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన మదనపల్లె జంట హత్యల కేసు పోలీసుల విచారణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలేఖ్య గతంలో పెట్టిన సోషల్ మీడియా పోస్టులు విస్మయానికి గురిచేస్తున్నాయి. పునర్జన్మలపై వారికున్న అపార నమ్మకమే హత్యలకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో గుర్తించిన వివరాల ప్రకారం… ఈ నెల 22న తన పేరును ‘మోహిని’గా మార్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో అలేఖ్య పోస్టులు పెట్టింది.