Andhra Rains: వర్షాలే వర్షాలు బుల్లోడా.! ఏపీకి వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాలు అల్లకల్లోలమే

గంటకు 13 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, ఈరోజు, అక్టోబర్ 02, 2025న ఉదయం 0830 గంటలకు IST వద్ద అదే ప్రాంతంపై అక్షాంశం 18.0N మరియు రేఖాంశం 85.6E సమీపంలో కేంద్రీకృతమై ఉంది. గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 160 కి.మీ, కళింగపట్నం(ఆంధ్రప్రదేశ్)కు తూర్పున 170 కి.మీ, పూరీ (ఒడిశా)కు దక్షిణంగా 200 కి.మీ

Andhra Rains: వర్షాలే వర్షాలు బుల్లోడా.! ఏపీకి వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాలు అల్లకల్లోలమే
Andhra Weather Report

Updated on: Oct 02, 2025 | 1:55 PM

పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం వైపుగా కదులుతోంది. 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యదిశగా సాగుతోంది. గురువారం రాత్రికి పారాదీప్ – గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉంటుందన్నారు. రాగల 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాళ్లు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన పోర్టులలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఇది చదవండి: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే

రెడ్ అలర్ట్: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం.. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్య అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్ అలర్ట్: విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లా.. ఆయా జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు.. 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుందన్నారు.

ఎల్లో అలర్ట్: కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు కోనసీమ.. ఆయా జిల్లాలకు భారీ వర్ష సూచన.. 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. రేపు శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా